కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తుంది. చాప నీరు లాగా ఈ వైరస్ చాలా దారుణంగా విస్తరిస్తుంది.గాలి కూడా చొరబడని  ప్రదేశాల్లోను కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇక మంగళవారం నాడు భారత దేశం లో 2.94 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాలతో పోలిస్తే ఎక్కువ కేసులు నమోదు అయిన రెండవ దేశం మనదే. ఇదిలా ఉంటే కరోనా కారణంగా చాలా మంది చనిపోతున్న సంగతి తెలిసిందే.నిజామాబాద్‌ జిల్లాలో ర్యాపిడ్‌ టెస్టుల కిట్లు, వ్యాక్సిన్‌ నిల్వలు అయిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 5,007 మందికి 52 సెంటర్లలో వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్‌ నిల్వలు కూడా పూర్తిగా నిండుకున్నాయి.ఇప్పటివరకు జిల్లాలో 97,371 మందికి టీకా వేశారు.


వ్యాక్సిన్‌ను రోజూ 6 వేల నుంచి 7 వేల మంది వరకు తీసుకుంటున్నారు. మూడు, నాలుగు రోజులకు ఓసారి హైదరాబాద్‌ నుంచి 12 వేల నుంచి 14 వేల వరకు టీకాలు వస్తున్నాయి.మంగళవారం జిల్లాలో 5,407 ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా, 445 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ర్యాపిడ్‌ టెస్టుల కిట్లు సరిపోకపోవడంతో పలు ఆరోగ్య కేంద్రాల్లో వందలాది మంది కరోనా బాధితులు టెస్టులు చేయించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. జిల్లా వైద్య శాఖ అధికారులు ర్యాపిడ్‌ కిట్ల కోసం రాష్ట్ర ఉన్నతాధికారులకు విన్నవించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌లు విధించుకుంటున్నారు. ఇప్పటికే 15 గ్రామాలకు పైబడి సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. జిల్లాలో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన 56 ప్రైవేట్‌ ఆస్పతులు నిండిపోయాయి. సుమారు 1,200 మంది వరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల్లో పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్‌ అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు రోగులే తెచ్చుకోవలంటూ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.మూడున్నర వేలకు లభించే ఇంజెక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయిస్తున్నారు.


జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో 500 పడకల సామర్థ్యం ఉండగా, 415 వరకు పడకలు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇందులో 153 మంది ఐసీయూలో ఉన్నారు. 34 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 2,530 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత ఏప్రిల్‌ 10 నుంచి ఇప్పటివరకు 2,720 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 18 వరకు అధికారిక లెక్కల ప్రకారం 32 మంది మరణించారు. హైదరాబాద్‌ నుంచి కిట్లు వస్తే తప్ప బుధవారం ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించే పరిస్థితి లేదు.వ్యాక్సిన్‌ వస్తేనే టీకా కార్యక్రమం కొనసాగనుంది.ఒకటి పక్కన ఏమో కేసులు తెగ పెరిగిపోతున్నాయి. మరో పక్క కిట్లు, వ్యాక్సిన్ లు ఏమి లేవు.ఈ పరిస్థితిలో ఏం పాలుపోక తల పట్టుకొని కూర్చుందంట ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: