ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మొన్నటి వరకు అతి తక్కువ ఉన్న కేసుల ఉండగా.. ఇక చూస్తూ చూస్తుండగానే కరోనా కేసులు పెరిగిపోయాయ్. ఇక మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చిచూస్తే రెండవ రకం కరోనా  వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో  ప్రజలందరూ బెంబేలెత్తి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వెరసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు విపత్కర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయ్. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం కఠినమైన చర్యలు చేపడుతుంది.



 కఠిన ఆంక్షలతో రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది రాష్ట్రప్రభుత్వం. ఇకపోతే అటు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతున్నప్పటికీ అక్కడక్కడ ఆక్సిజన్ కొరత మాత్రం ప్రజలందరినీ వేధిస్తూనే ఉంది. ఇప్పటికీ కొంతమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో ఎంతోమంది సేవా భావం కలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.



 ప్రస్తుత  క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఇక ఎంతో మంది ప్రాణాలు నిలబడాలి అనే ఉద్దేశ్యంతో నాలుగు ప్రాంతాల్లో ఆక్సీజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది టిడిపి. రేపల్లె,పాలకొల్లు, కుప్పం, టెక్కలి లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. హెరిటేజ్ సంబంధించినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారి ఫండ్స్ సహకారంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న గొప్ప అని ప్రశంసిస్తున్నారు విశ్లేషకులు . అదే సమయంలో ఇక టీ డీ పీ కి మద్దతుగా ఎంతో మంది ఎన్నారైలు ఉన్నారు కాబట్టి వారి చేత క్వారంటైన్ సెంటర్లో ఆహారం అందించడం లాంటివి చేసేలా పిలుపునిస్తే  ఇంకాస్త బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: