భైంసా లో గతంలో జరిగిన అల్లర్ల గురించి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం మర్చిపోదు. హిందూ, ముస్లింల మధ్య తీవ్రస్థాయిలో మతకలహాలు చెలరేగాయి. దీంతో ఏకంగా ముస్లింలు హిందువులు ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి  ఇలా మత కలహాలను కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా సమస్యగా మారిపోయింది. చివరికి భారీగా పోలీసుల మోహరింపులు చేసి కొన్ని రోజులపాటు ఇక మతకలహాలు జరగకుండా ఉండేలా భైంసాలో నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 ఇక అల్లర్లు కాస్త సద్దుమణిగాయి అనుకుంటున్న తరుణంలో ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఇక మతకలహాలు రెచ్చ గొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవలే బైంసాలో ఇలాంటి తరహా ప్రయత్నం జరిగింది. కానీ పోలీసులు సకాలంలో స్పందించడంతో చివరికి ఇక మతకలహాలు జరిగి మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఆపగలిగారు. మతకలహాలు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలి   అనుకున్న నిందితులను అరెస్టు చేశారు.  ఇటీవలే బైంసా లోని ఓ మసీదుపై జైశ్రీరామ్ అనే రాశారు. అయితే ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని స్థానికంగా ఉన్న సిసి టివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.


 ఈనెల 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు జైశ్రీరామ్ అని రాశారు అన్న ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. 24 గంటల్లో నిందితులను గుర్తించారు. అదే ప్రాంతానికి చెందినటువంటి మహమ్మద్ కైఫ్ అనే యువకుడు 14 ఏళ్ల బాలుడు తో జైశ్రీరామ్ అని మసీదుపై రాయించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.  ఈ క్రమంలోనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ..  అసలు మతకలహాలు రెచ్చగొట్టాలి అనుకుంటుంది ఎవరు అనే విషయాన్ని కనుగొంటే పూర్తిస్థాయిలో సమస్యకు పరిష్కారం చూపించవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: