అధికార వైసీపీలో రెడ్డి నేతల ఆధిపత్యం ఎలా ఉంటుందో..ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం హవా ఎక్కువగా ఉంటుందని సంగతి తెలిసిందే. ఆ పార్టీని నడిపించేది కమ్మ నాయకుడు కాబట్టి, ఆ సామాజికవర్గం ఎక్కువగా టీడీపీకే సపోర్ట్ ఉంటుంది. అలాగే పార్టీలో కమ్మ నేతలు ఎక్కువగా ఉంటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ నేతలు ఎక్కువగా కనిపిస్తారు.


అయితే ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి కమ్మ నేతలు పెద్దగా కనిపించడం లేదు. కానీ కొందరు మాత్రం పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కాపులు, శెట్టిబలిజలు, రాజుల ప్రభావం ఎక్కువగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన ముగ్గురు కమ్మ నాయకులు పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు.


చింతమనేని ప్రభాకర్, గన్నీ వీరాంజనేయులు, అరిమిల్లి రాధాకృష్ణలు పార్టీకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. అలాగే ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు వీరు కృషి చేస్తున్నారు. చింతమనేని వరుసగా 2009, 2014 ఎన్నికల్లో దెందులూరు నుంచి గెలిచి, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. దూకుడు స్వభావం కలిగిన చింతమనేని, ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యి, పార్టీ కోసం పనిచేస్తున్నారు. దెందులూరు ప్రజలకు అండగా ఉంటూ, తనకు సాధ్యమైన మేర ప్రజలకు సాయం చేస్తున్నారు. ఇలా నిదానంగా దెందులూరులో చింతమనేని లైన్ అయినట్లు తెలుస్తోంది.


అటు గన్నీ, ఉంగుటూరులో పార్టీని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఉంగుటూరు బరిలో ఓడిపోయిన గన్నీ, ఏ మాత్రం సైలెంట్ అవ్వకుండా మళ్ళీ పార్టీని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఓ వైపు ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడుగా పనిచేస్తూనే, మరోవైపు ఉంగుటూరు బాధ్యతలని చూసుకుంటున్నారు. ఇక ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన అరిమిల్లి 2014లో తణుకు నుంచి గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయినా సరే పార్టీ కోసం కష్టపడుతున్నారు. ప్రస్తుతానికి తణుకులో టీడీపీని బాగానే నిలబెట్టారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp