ఇజ్రాయిల్ తమ దేశ రక్షణ విషయం లో ఎంత ఖచ్చితత్వం  తో ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. తమ దేశ రక్షణకు భంగం కలుగుతుంది అని భావిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోదు. అంతే కాదు ఇక ఇజ్రాయిల్ కు పొంచి ఉన్న ప్రమాదాన్ని నామ రూపాల్లేకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉగ్రవాదం విషయం లో ఎప్పుడూ ఈ విరుచుకు పడుతూ ఉంటుంది ఇజ్రాయిల్.  ఈ క్రమం లో సీరియా, పాలస్తీనాలో ఉగ్రవాదుల ఆగడాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ ఉంటుంది. ఇలా ఇజ్రాయిల్ స్ఫూర్తితోనే ఇక ఉగ్రవాదం అంటే భయపడే ప్రపంచ దేశాలు ఉగ్ర వాదులను ముప్పుతిప్పలు పెట్టడం మొదలు పెట్టాయి.



 ఇలా ఉగ్రవాదాన్ని నామరూపాలు చేసేందుకు ఎప్పుడూ ముందుండే ఇజ్రాయిల్ ప్రస్తుతం ఉగ్రవాదుల మొదటి టార్గెట్ గా మారిపోయింది అని తెలుస్తోంది.  ఇజ్రాయిల్ ను చక్రబంధంలో ఇరికించించేందుకు ప్రస్తుతం పెద్ద ప్రయత్నం జరుగుతుంది అని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.  ఇప్పటికే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యం సాధించేందుకు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో తాలిబన్లు సిరియా పాలస్తీనా ఉగ్రవాదులతో కూడా కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రపంచ తీవ్రవాదులు మొత్తం ఏకమై మళ్ళీ అల్లకల్లోల పరిస్థితులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .



 అయితే ఈ ప్రపంచ తీవ్రవాదుల మొదటి టార్గెట్ అటు ఇజ్రాయిల్ అంటున్నారు. ఎందుకంటే పాలస్తీనా సిరియా లాంటి  దేశాలలోని ఉగ్రవాదులపై ఇజ్రాయిల్ ఎప్పుడూ ఎటాక్ ఉంటుంది.  ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు  ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఇక భవిష్యత్తులో మళ్లీ మత రాజ్య స్థాపన జరిగి ఉగ్రవాద సంస్థలు ఆధిపత్యం చెలాయించాలని  అంటే ముందుగా ఇజ్రాయిల్ టార్గెట్ చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు అందరూ ఏకమై పోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: