తాము అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో మత విద్వేషాలు ఖచ్చితంగా రగిలిస్తాం.. భూములు ఆక్రమించుకున్న కొందరు వాటిని నిజాం ఆస్తులుగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ వెనకున్న రహస్యం ఏంటో చెప్పాలి. ఒక్క కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ అయి ఘోషిస్తోంది అని సంజయ్ ఆరోపించారు.

2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని బండిసంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రలో అన్నారు. పాతబస్తీకి మెట్రో రాకుండా ఎమ్ఐఎమ్ అడ్డుకుందని విమర్శించిన ఆయన.. పాతబస్తీని ఎందుకు అభివృద్ది చేయడం లేదో చెప్పాలని అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తన ప్రజా సంగ్రామయాత్రకు అన్ని వర్గాల నుండి అనూహ్య స్పందన వస్తోందన్నారు బండిసంజయ్. ఎక్కడికి వెళ్లినా.. అనేక సమస్యలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు బాధ, ఆవేశంతో ఉన్నారని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉపఎన్నికలు వస్తేనే కేసీఆర్ బయటకు వస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు.

మరోవైపు ఒవైసీ సోదరులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎంఐఎం నేతలను పాకిస్థాన్ కు పంపిస్తామన్నారు. పాతబస్తీలో బీజేపీ సభను ఓవైసీ సోదరులు అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీల కాళ్లు పట్టుకోవడం ఎంఐఎంకు అలవాటేనన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన 10వేల రూపాయలు తీసుకొని ప్రజలు బీజేపీకి ఓటు వేశారన్నారు. తెలంగాణను కేసీఆర్ మత్తు తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చే ప్రతి పైసా ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఖర్చు చేస్తారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కూలీ చేసి, తన ఆస్తులు అమ్మి డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ ఉపఎన్నిక కేసీఆర్ అహంకారం మీద దెబ్బకొట్టే పంచాయితీ అనీ.. తనను ఓడించేందుకు కేసీఆర్ వెయ్యికోట్లు ఖర్చు పెడుతున్నారని ఈటల అన్నారు






మరింత సమాచారం తెలుసుకోండి: