వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. ఇది రాజకీయ పార్టీ కాదు... వైఎస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం ఈ సభ అని పేర్కొన్నారు. వైఎస్ బ్రతికి ఉన్నప్పుడు నేను బయటకు రాలేదు... ఆ తరువాత రావాల్సి వచ్చింది అని పేర్కొన్నారు. వైఎస్ ప్రేమ ఆకాశమంత విశాలమైనది అని ఆమె తెలిపారు. భావోద్వేగానికి గురైన విజయమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. వైఎస్ వెళ్లిపోయిన తరువాత మా బిడ్డల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు ఎక్కడ వెళ్లిన ఓ భరోసా ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు.

ప్రజల రుణం తీర్చుకోలేనిది అన్నారు ఆమె. రెండు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట వైఎస్ ను తలుచుకుంటూనే ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ప్రతి మలుపు జనజీవనంతో ముడిపడి ఉందని చెప్పేవారు అని ఆమె అన్నారు. అందరితో ఉండాలని, అందరి ప్రేమించాలని చెప్పేవారు అన్నారు. ఆయనకు ప్రజలపై ఆకాశంత ప్రేమ ఉండేది అని చెప్పుకొచ్చారు. ఆదరించి అక్కున చేర్చుకున్నారు అని నా కుటుంబం ఎప్పుడు మీ అందరికి రుణపడి ఉంటాం  అని స్పష్టం చేసారు. వైఎస్ ని తలవకుండా పూట గడవని సందర్భం రెండు రాష్ట్రాల్లో ఉంది  అన్నారు ఆమె.

ఏ మనిషిని అడిగిన ఆయనుంటే ఇలా ఉండేది కాదు అనే చెప్తారు అని అన్నారు. ఏ రాయిని అడిగిన నీ పేరే చెప్తుంది, ఇంత ప్రజల ప్రేమ యెట్లా సంపాదించవని రాజీవ్ గాంధీ ఆశ్చర్యం వ్యక్తం చేసారు అని ఆమె చెప్పుకొచ్చారు. మేము అధికారంలో ఉన్నామంటే అందుకు కారణం వైఎస్ అని స్వయంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు అని ఆమె గుర్తు చేసారు. ఏ ప్రతిపక్ష నాయకుడు మరణించిన జెండా అవతనం చేయని బీజేపీ వైఎస్ చనిపోయినప్పుడు మాత్రమే అవతనం చేసి గౌరవించమని మోడీ చెప్పారు  అని ఆమె వెల్లడించారు. ఏ పథకం, ప్రాజెక్టు చుసిన రాజన్న గుర్తుకు వస్తారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap