నిన్న వైఎస్ వర్ధంతి కావడంతో ఆయనకు ప్రస్తుత రాజకీయాలకు ముడిపెట్టి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆ రోజున వైఎస్ లేకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉండేది కాదన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. తన పాలనతో ప్రజల ప్రేమను పొందిన నాయకుడు వైఎస్ఆర్.ఆయనపై ఎంతలా అభిమానాన్ని చూపిస్తున్నారంటే చనిపోయి 12  సంవత్సరాలయినా ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో ఆయన ఫోటోలు ఉన్నాయి. ఒక దేవుడిలాగా వైఎస్ ను పూజిస్తున్నారు. అయితే ఇవన్నీ తానేమి ప్రత్యేక పార్టీని స్థాపించి సాధించింది కాదు. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన నాయకుడే వైఎస్సార్. కానీ క్షేత్ర స్థాయిలో ఊరూరా తిరిగి పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించాడు.

కానీ ఈ రోజు అదే తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ ను పట్టించుకునే స్థితిలో లేకపోవడం దురదృష్టమని చెప్పాలి. ప్రస్తుతం కాంగ్రెస్ అద్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ విషయంపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కున్న పేరును వాడుకునే ఏపీలో జగన్ సీఎం అయ్యాడు. అదే విధంగా షర్మిల సైతం తెలంగాణాలో పార్టీ స్థాపించి దూసుకుపోతోంది. కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఎందుకు వైఎస్ పేరును ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదంది మిలియన్ డాలర్ల ప్రశ్న. వైఎస్ బిడ్డలుగా వారికి అంత హక్కున్నా, కాంగ్రెస్ నుండి బలపడిన నాయకుడిగా ఎదిగిన వైఎస్ ను చెప్పుకునేందుకు పార్టీకి ఎక్కువ హక్కుంది.

అలాంటిది ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ తప్పు చేస్తోందన్న అపవాదును మూటగట్టుకుంటోంది. ప్రస్తుతం పార్టీ ప్రజల్లో చాలా బలహీనంగా ఉన్న నేపథ్యంలో వైఎస్సార్ పేరును ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. రానున్న ఎన్నికల్లోపు వైఎస్ఆర్ వ్యూహాన్ని సరిగ్గా అమలుచేస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుంది. మరి రేవంత్ రెడ్డి ఏమి చేయనున్నాడో ? కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంపై ఏమి సూచించనుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: