కాశ్మీర్ లో మాన‌వ హ‌క్కుల‌ను కాల‌రాస్తూ.. ఆఫ్ఘానిస్థాన్ లో పౌర హ‌క్క‌ల గురించి భార‌త ప్ర‌భుత్వం మాట్ల‌డటం ఏమ‌టి కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీ ప్ర‌శ్నించారు. కాశ్మీర్ అంతా ప్ర‌శంతాగానే ఉంద‌ని.. అక్క‌డా ఎలాంటి నిర్భంధాలు జ‌ర‌గ‌డం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తోంద‌ని అన్నారు. త‌న‌ను హౌస్ అరెస్టు చేసి నిర్భంధించి వేధిస్తున్నార‌ని ట్వీట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. వీటితో పాటు త‌న ఇంటి గేటుకు తాళం వేసిన ఫోటోల‌ను ట్వీట్ట‌ర్ ద్వారా పంచుకుంది. అలాగే త‌న ఇంటి ముందు ఉన్న పోలీసు వాహ‌నాల పోటో ల‌ను సైతం ట్వీట్ట‌ర్ లో ఉంచింది. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ విష‌యంలో అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేసి దేశ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాల‌ని చూస్తోంద‌ని విమ‌ర్శించారు. కాశ్మీర్ అంతా బాగ ఉంటే త‌న‌ను ఎందుకు గృహ నిర్భంధం చేశార‌ని ప్ర‌శ్నించారు.


ఈ విష‌యంపై ఒక సీనియ‌ర్ పోలీస్ అధికారి స్పందించారు. గ‌త బుధ‌వారం పాక్ అనుకూల, కశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ మరణించారు. దీంతో ఆయ‌న స్వ‌స్థ‌ల మైన కుల్గామ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు.  ఇలాంటి ఉద్రిక్త ప‌రిస్థితుల‌ల్లో పీడీపీ నేత మాజీ సీఎం  మెహబూబా ముఫ్తీ ఆ ప్రాంతానికి వెళ్లాల‌ని అనుకున్నార‌ని తెల‌పారు.  జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న మెహబూబా ముఫ్తీ అక్క‌డికి వెళ్తే  సెక్యూరిటీ సమస్యలు వ‌స్తాయ‌ని అంద‌కు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని చేప్ప‌రు.  మెహబూబా ముఫ్తీ అక్క డికి వెళ్లే అవకాశం ఉండటంతో ఆమెను కేవ‌లం వెళ్లకుండా అడ్డుకున్నామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. మెహబూబా ముఫ్తీని అరెస్ట్ చేస్తున్నామ‌ని కాని, గృహ నిర్భంధంలో ఉంచుతున్నామ‌ని చెప్ప‌లేద‌ని అంటు వివ‌ర‌ణ ఇచ్చారు. గిలాని మ‌ర‌ణం త‌ర్వాత కుల్గాం ప్రాంతంలో ప‌లు ఆంక్ష‌లు విధించినా ఇప్ప‌టికే వాటిని ఎత్తేశామ‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: