వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గుర్తున్నాడు కదా.. అది మర్చి పోయే పేరు కాదు  ఎందుకంటే భారత ప్రజల గౌరవాన్ని మొత్తం నిలబెట్టిన వ్యక్తి ఆయన. శత్రువుల చెరలో ఉన్నప్పటికీ ధైర్యాన్ని సైతం కోల్పోకుండా కనీసం భయం బెరుకు లేకుండా.. భారత పౌరుషాన్ని చాటిచెప్పిన గొప్ప సైనికుడు ఆయన. పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారత సత్తా ఏంటో చాటిన సోల్జర్ అభినందన్ వర్ధమాన్. అప్పట్లో భారత్ బాలకోట పై సర్జికల్ స్ట్రైక్ చేసిన సమయంలో జరిగిన ఘటనని ఎవరూ మర్చిపోలేరు. దాయాది పాకిస్థాన్ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చినా పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఆ తర్వాత యుద్ధ విమానం పేలి పోవడంతో ఇక పారాచూట్ సహాయంతో కిందికి దిగారు.


 ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే ఈ సైనికుడు నుంచి ఎన్నో రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కానీ శత్రువుల చెరలో ఉన్నప్పటికీ ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా దేశ రహస్యాలను బయట పెట్టకుండా ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించారు అభినందన్ వర్ధమాన్. అయితే ప్రస్తుతం భారత వాయు సేనలో వింగ్ కమాండర్ గా పని చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే.  అయితే ఆనాడు ఎంతో ధైర్యసాహసాలు చాటిన అభినందన్ వర్ధమాన్ కి ఇటీవలే భారత వాయుసేన లో పదోన్నతి దక్కింది. ఏకంగా గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ దక్కించుకున్నాడు అభినందన్ వర్ధమాన్.



 దీంతో ఇక భారత ప్రజలు అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే గతంలో 2019 ఫిబ్రవరి 27న భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత రోజున పాకిస్తాన్ వాయుసేన   ప్రతి దాడి కోసం భారత్ గతంలోకి యుద్ధ విమానాల్లో పంపింది. అయితే భారత్ వైపు పంపిన యుద్ధ విమానాలను తిప్పికొట్టేందుకు భారత వాయుసేన బలగాలు గగనతలంలో ముందుకు తీసుకెళ్లాయ్. ఈ క్రమంలోనే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్  నడుపుతున్న మీగ్ 21  యుద్ధ విమానం ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. అదే సమయంలో అభినందన్ వర్ధమాన్ నడుపుతున్న యుద్ధ విమానం కూడా కుప్పకూలి పోవడం తో పారాచూట్ సాయంతో బయటపడ్డాడు. ఇక ఆ సమయంలో ధైర్యసాహసాలను ప్రదర్శించిన అభినందన్ వర్ధమాన్ కి ఆ సమయంలోనే పదోన్నతి వస్తుంది అని భావించారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి: