గత కొంత కాలం నుంచి పెట్రోల్ ధరలు ఏ రేంజిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  చూస్తూ చూస్తుండగానే పెట్రోల్ ధరలు సామాన్య ప్రజలు అందరికీ కూడా భారం గా మారిపోయాయ్. పెట్రోల్ ధరలు వంద రూపాయలకు చేరడంతోనే భయపడిపోయిన సామాన్య ప్రజలు ఇక ఇప్పుడు అంతటితో ఆగకుండా అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో వాహనం బయటికి తియ్యాలి అంటేనే భయపడిపోతున్నారు. ఇక రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటే పెరిగిపోయిన నిత్యావసర ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారిపోయాయ్. ఇలాంటి సమయంలో పెట్రోల్ ధరలు కూడా అంతకంతకు పెరుగుతూ ఉండడంతో సామాన్యుడు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నాడు.


 అయితే గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విరుచుకు పడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే  పెట్రోల్ ధరలు తగ్గించే దిశగా ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెట్రోల్ ధరల కారణంగా సామాన్యుడిపై భారం పెరిగిపోయిన నేపథ్యంలో పెట్రోల్ ధరలు తగ్గించి ఇక అందరికీ ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధర వంద రూపాయలకు పైగానే ఉంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ప్రస్తుతం సెంచరీ దాటిపోయిన పెట్రో ధరలను 60 రూపాయలకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం ప్రణాళికలను  చేసినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇంధన ధరలను మరింత తగ్గించడానికి మోదీ సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.   ఇక ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట ప్రకారం ముడిసరకు దిగుమతులపై ఆధారపడటం  తగ్గించి ఇథనాల్ బ్లెండింగ్ ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. దీనిద్వారా ఫ్లెక్స్ ఇంధనం  తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. దీనికోసం ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ డ్రాఫ్ట్ కూడా తయారు చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం సామాన్యుడి ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: