నీలాంటి ఎంపీ లను, ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ లను ఎంత మంది ని సృష్టించా అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా తెలంగాణా సిఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. టీఆరెస్ జెండా సృష్టికర్త ని..నా మీదనే మాట్లాడుతారా అంటూ ఆయన ప్రశ్నించారు. దేశంలో ప్రేక్షక పాత్ర లా చూస్తుంది బీజేపీ అని తగాడానికి కూడా నీళ్లు లేవు అన్నారు. కేంద్రం కి నీటి సంపాదను వాడే తెలివి లేదు అని ఆయన ఎద్దేవా చేసారు. ట్రిబునల్ కి ఏడేళ్ల.. తెలంగాణ కి నీళ్లు కావాలా వద్దా..? అంటూ ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి నీటి విషయంలో కలుస్తున్నాం అని అఫెక్స్ కౌన్సిల్ గేట్ వద్దకు కూడా బండి సంజయ్ ని రానివ్వరు అని ఆయన ఎద్దేవా చేసారు. 7 మండలాలు గుంజుకున్న నాడు బీజేపీ నేతలు ఎక్కడ..? అని ఆయన ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ అర్జంట్ గా కావాలా..? సంజయ్ అంటూ తన శైలి లో కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైతుల పక్షాన బీజేపీ నాయకులు మాతో ధర్నా కి కూర్చుంటారు అని అన్నారు. బాధ్యత లేదు బీజేపీ రాష్ట్ర నాయకులకు అని ఆయన ఆరోపించారు. మరో సారి చెబుతున్న యాసంగి లో రైతులు వడ్లు వేయొద్దు అని ఆయన కోరారు.

టీఆరెస్ పార్టీ కి వచ్చే నిధులు కూడా లెక్కలు చెబుతున్నాం అని 450 కోట్లు టీఆరెస్ పార్టీ కి వచ్చిన డబ్బులు బ్యాంకు లో ఉన్నవి అని ఆయన స్పష్టం చేసారు. న్యూ యార్క్ టైమ్స్ లో కాళేశ్వరం ప్రాజెక్టు చూపించారు అని కేసీఆర్ పేర్కొన్నారు. శక్తి సామర్ధ్యాలను బట్టి పదవులు ఇస్తామని అన్నారు ఆయన. ధాన్యం కొనే వరకు మిమ్మల్ని వెంటాడుతాం అని ఆయన స్పష్టం చేసారు. మందు తాగుతావు అనడమేనా సంస్కారం  అని ఆయన నిలదీశారు. నాకు గెస్ట్ హౌస్ లేదు మీకు ఉన్నవి.. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయం చేసుకునే క్షేత్రం అని అన్నారు ఆయన. వ్యవసాయం చేసుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గా నా ఇల్లు అమ్ముకున్న అంటూ... 17 కోట్లు వస్తే ఫామ్ హౌస్ లో ఇల్లు కట్టుకున్నాం అని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన అన్నారు  కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: