డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు.. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి జవాద్ అనే పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. అలాగే తుపాను తీరం దాటే సమయంలో వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోల్లంగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే మత్య్సకారులను అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు అండమాన్ తీరంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసినట్లు తెలిపారు. మరో మూడు రోజుల పాటు అల్ప పీడన ప్రభావం ఉంటుందని... ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.