అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పాటించిన కరోనా మహమ్మారి, కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజల్లో ఆందోళన సృష్టిస్తోంది. కరోనాపై అధ్యయనం చేసిన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, ప్రపంచ కరోనా వైరస్ బారిన పడిన సంఖ్య  272 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. అయితే మరణాలు 5.32 మిలియన్లకు పైగా పెరిగినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా టీకాల పంపిణీ కూడా 8.54 బిలియన్లకు పెరిగినట్లు యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం  యూనివర్శిటీ ప్రకటించిన తాజా అప్‌డేట్‌లో, యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSSE) ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా   మరణాల సంఖ్య వరుసగా 272,146,742 ఉండగా 5,328,975గా ఉందని వెల్లడించింది. 

 అయితే మొత్తం వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 8,547,694,355కి పెరిగినట్లు గుర్తించామని CSSE అధికారి ఒకరు తెలిపారు. CSSE ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా 50,374,099 కరోనా కేసులు, 802,502 మరణాలు యూఎస్ సంభవించినట్లు, యూఎస్ కరోనా కారణంగా  అత్యంత దెబ్బతిన్న దేశంగా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. కరోనా కేసుల పరంగా రెండవ స్థానంలో అత్యంత దెబ్బతిన్న దేశంగా భారత్ ఉంది. భారత్ లో 34,710,628 ఇన్ఫెక్షన్లు మరియు 476,135 మరణాలు చోటు చేసుకున్నాయని అధ్యయన అధికారులు తెలిపారు. మూడవ స్థానంలో బ్రెజిల్ ఉండగా 22,201,221 ఇన్ఫెక్షన్లు మరియు 617,271 మంది కరోనా కారణంగా మరణించినట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. 

వీటితో పాటు.. 5 మిలియన్లకు పైగా కరోనా కేసులు యూకే లో 11,073,455, రష్యాలో 9,927,150, టర్కీలో 9,102,294, ఫ్రాన్స్ లో 8,504,074, జర్మనీలో  6,656,270, ఇరాన్ లో 6,162,954, అర్జెంటీనాలో 35,437, ఇటలీలో 5,282,076 ఉండగా..  కొలంబియాలో 5,099,746 నమోదైనట్లు సీఎస్ఎస్ఈ  గణాంకాలు చూపించాయి. 100,000 కంటే ఎక్కువ మంది మరణించిన దేశాలు మెక్సికో  296,984, రష్యా 287,135, పెరూ 201,902, యూకే  147,249, ఇండోనేషియా 143,969, ఇటలీ 135,178, ఇరాన్ 130,8283, ఫ్రాన్స్ 121,968, అర్జెంటీనా 116,857, జర్మనీ 106,934 లుగా యూనివర్శిటీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: