కర్ణాటక ఎమ్మెల్యే రమేష్ కుమార్ వివాదాస్పద కామెంట్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న రమేష్ కుమార్ సెగ ఇప్పుడు ఢిల్లీని కూడా తాకింది. రమేష్ కుమార్ టార్గెట్ గా ప్రతిపక్ష కాంగ్రెస్ ను కార్నర్ చేస్తోంది బిజెపి. భేటీ బచావో అంటూ హడావిడి చేసే రాహుల్,ప్రియాంక గాంధీలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు బిజెపి నేతలు. యూపీలో మహిళల పై ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు ఆగమేఘాలపై స్పందించే గాంధీ త్రయం ఇప్పుడు నోరు ఎందుకు మెదపడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.

 మహిళల విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఒక రూల్,వేరే పార్టీ ఎమ్మెల్యేలకు మరొక రూల్ ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ ప్రతినిధి చేసి ఉంటే నానా రచ్చ చేసేవారని,ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటూ విమర్శిస్తున్నారు. రాహుల్, ప్రియాంక లు రమేష్ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ప్రజల కష్టాలను ఎత్తిచూపుతూ వర్షం,వరద సంబంధిత నష్టాలపై చర్చల సందర్భంగా మాట్లాడానికి ప్రయత్నించారు.ఈ సందర్భంలో స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే తనకు మాట్లాడడానికి సమయం లేదని, చర్చను త్వరగా ముగించాలని కోరారు. అయితే విపక్ష సభ్యులు సమయం పొడిగించాలని కోరారు. షెడ్యూల్ ప్రకారం సభలో జరగాల్సిన కార్యక్రమాలు జరగడం లేదనే తన బాధ అని స్పీకర్ వివరించారు.

ఈ సమయంలో మాజీమంత్రి రమేష్ కుమార్ జోక్యం చేసుకొని  అత్యాచారం అనివార్యమైనప్పుడు పడుకోని ఆనందించాలని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అత్యంత దారుణమైన ఈ వ్యాఖ్యల పట్ల దేశమంతా నిరసనలు తెలుపుతుంది. రమేష్ కుమార్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తోంది. రమేష్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు సౌమ్య రెడ్డి, అంజలి. దేశానికి కర్ణాటక అసెంబ్లీ క్షమాపణ చెప్పాలని అంటున్నారు, రమేష్ ప్రస్తావన సహించరానిది అన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలను ఆయన సస్పెన్షన్ డిమాండ్ కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: