ప్రపంచ వ్యాప్తంగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలు దేశాలకు పాకిన  ఒమిక్రాన్.. భారత్‌లోను చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. పలు ప్రాంతాల్లో నమోదు అవుతున్న కొత్త వేరియంట్ కేసులతో ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతే కాదు ఈ కొత్త వేరియంట్ ఎలాంటి పెను ప్రమాదాన్ని తెస్తుందో అని అంతా కంగారు పడుతున్నారు. ఓ వైపు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే మరో వైపు ఈ కొత్త ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ భయపెడుతున్నాయి.

అందులోనూ ఇదే థర్డ్ వేవ్ ఏమో అని తల్లితండ్రులు చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే థర్డ్ వేవ్ లో పిల్లల పైనే ప్రభావం ఎక్కువ ఉంటుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెప్పి ఉన్నారు. అయితే ఇదే తరహాలో ఒమిక్రాన్ కేసులు కనుక భారీగా పెరిగితే మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుంది. ఇలాంటి తరుణంలో పిల్లల పట్ల అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కొత్త వేరియంట్ పిల్లల పై ఏ మేరకు ప్రభావం చూపుతుంది అన్నది తెలియాలంటే ఇప్పుడే ఒక అంచనాకు రాలేనీ పరిస్థితి. ఇంకొంత అధ్యయనం జరిగితే కానీ చెప్పలేమన్నారు సైంటిస్టులు.

మరి ఇలాంటి సమయంలో ముందు జాగ్రత్తగా ముఖ్యంగా పాఠశాలలు మళ్ళీ మూత పడనున్నాయి అని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ నిర్ణయం అంత సామాన్యమైనది కాదు. కాగా దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. ఇప్పటికే రెండు సంవత్సరాలుగా విద్యా సంస్థలు మూతపడి చదువులు అస్తవ్యస్తంగా మారి పోయాయి. మరి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: