
ప్రభుత్వం నుంచి 14 నుంచి 29 శాతం కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి నేతలు సమావేశం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సీఎంతో సమావేశం సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా నిన్న బుధవారం రాష్ట్ర సీఎస్, మంత్రి బుగ్గన, సజ్జలతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై చర్చలు జరిపారు. పీఆర్‌సీపై ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ అవుతారు అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు. ఈరోజే ఫైనల్ డెసిషన్ ఉంటుందని కూడా చెప్పారు. మరొకవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం కంటే తమకు ఎక్కువ ఫిట్‌మెంట్ వస్తుందని, ఉద్యోగ సంఘాల నేతలు ఆశిస్తున్నారు. అదే సమయంలో 40 శాతానికి పైగా డిమాండ్ చేస్తున్నా.. 30 శాతానికి అటుఇటుగా ఫిట్‌మెంట్ ప్రకటించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
అయితే డీఏల బకాయిలు ఉండటతో వీటిని పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ వద్ద ఫిట్‌మెంట్ పై ఉద్యోగ సంఘాల ప్రతిపాదన చేసే అవకాముంది. ఇంకా రూ.1,600 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. ఈ అంశంపై ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తంగా ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీతో సహా ఆర్థిక పరమైన అంశాలకు సీఎం జగన్ ఇవాళ ముగింపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు మకర సంక్రాంతి కానుకగా పీఆర్‌సీ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది.