చ‌లికాలంలో న‌ల్ల ఎండు ద్రాక్ష‌ను ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్‌గా తీసుకోవ‌చ్చు. మిమ్మ‌ల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌డ‌మే కాకుండా చాలా కాలం పాటు క‌డుపు నిండుగా ఉండేవిధంగా చేస్తుంది. న‌ల్ల ఎండు ద్రాక్ష బరువు త‌గ్గ‌డంలో మీకు సాయ‌ప‌డుతుంది. కొలెస్ట్రాల్, ర‌క్త‌పోటు స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచ‌డంలో సహాయ‌ప‌డుతుంది. న‌ల్ల‌ద్రాక్ష‌ను రాత్రి అంతా నీటిలో నాన‌బెట్ట‌డం వ‌ల్ల వాటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఎందుకంటే అలా చేయ‌డంతో వాటిలో యాంటి ఆక్సిడెంట్ల ప‌రిమాణం అనేది పెరుగుతుంది.

న‌ల్ల ద్రాక్ష‌ను ఎండ‌బెట్టి న‌ల్ల ఎండుద్రాక్ష‌ను త‌యారు చేస్తుంటారు. కేకులు, ఖీర్‌, బ‌ర్ఫీ త‌దిత‌ర వాటిలో ఉప‌యోగిస్తారు. ముఖ్యంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డం నుంచి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని తొల‌గించ‌డం వ‌ర‌కు లెక్క‌లేన‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చుతుంది. పోటాషియంతో పాటు న‌ల్ల ఎండు ద్రాక్ష‌లో చాలా కాల్షియం ఉంఉటంది. ఎముక‌ల‌కు చాలా మేలు చేస్తుంది. అధ్య‌యనాల ప్ర‌కారం.. న‌ల్ల ఎండు ద్రాక్ష‌లో ఉండే సూక్ష్మ పోష‌కాలు బోలు ఎముక‌ల వ్యాధి రాకుండా నిరోధించ‌డంలో స‌హాయ‌ప‌డుతాయి. అయితే చ‌లికాలంలో జ‌ట్టు పొడిబార‌డం, చీలిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న‌ట్ట‌యితే ప్ర‌తిరోజూ న‌ల్ల ఎండు ద్రాక్ష తిన‌డం మొద‌లు పెట్టండి. ఇనుము, శ‌రీరానికి బ‌ల‌మైన శ‌క్తితో పాటు పెద్ద మొత్తంలో విట‌మిన్ సిని ఇస్తాయి.

 ఖ‌నిజాల‌ను వేగంగా గ్ర‌హించ‌డంలో  ఇది స‌హాయ‌ప‌డుతుంది. జుట్టుకు పోష‌ణ‌ను అందిస్తుంది. ర‌క్త‌పోటు స‌మ‌స్య‌తో పోరాడుతున్నట్టయితే న‌ల్లఎండుద్రాక్ష ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుంది. ఎండుద్రాక్ష‌లో అధిక పోటాషియం స్థాయి నుంచి ర‌క్తం నుంచి సోడియంను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్త‌పోటు నియంత్రించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఎండుద్రాక్ష‌లో ఫైబ‌ర్ పుస్క‌లంగా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ఐర‌న్ అధికంగా ఉన్నందున న‌ల్ల ఎండు ద్రాక్ష‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తినడం ద్వారా ప్ర‌యోజ‌నం ఉంటుంది.

ముఖ్యంగా మ‌హిల‌కు రుతుస్రావం స‌మ‌యంలో నొప్పిని త‌గ్గించ‌డంలో కూడా న‌ల్ల ఎండు ద్రాక్ష స‌హాయ‌ప‌డుతుంది.  నాన‌బెట్టిన ఎండుద్రాక్ష‌ను తిన‌డం ద్వారా జీర్ణం సుల‌భ‌మ‌వుతుంది. ఎండుద్రాక్ష‌ల‌ను రాత్రి అంతా నాన‌బెట్టి ఉద‌యం ఖాళీ క‌డుపుతో తినాలని ప‌లువురు ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఇంకెందుకు ఆల‌స్యం న‌ల్ల‌ద్రాక్ష‌ను తిని  అంద‌రూ ఆరోగ్యంగా ఉండండి.


మరింత సమాచారం తెలుసుకోండి: