అవును నిజంగా జరిగిందిదే. అయితే జగన్మోహన్ రెడ్డి దెబ్బకు టీడీపీ క్లీన్ బౌల్డ్ అయ్యింది రాజకీయంగా కాదు  ఉద్యోగుల పరంగా.  ఉద్యోగుల సమస్యలపై జగన్ చేసిన ప్రకటనను టీడీపీ కానీ ఎల్లోమీడియా కానీ ఏమాత్రం ఊహించలేదు. కొద్ది రోజులుగా పీఆర్సీ, డీఏల విడుదల, సీపీఎస్ రద్దు తదితరాలపై ప్రభుత్వానికి, ఉద్యోగసంఘాల నేతలకు మధ్య పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ వివాదానికి తాజాగా జగన్ తనదైన పద్దతిలో ముగింపు పలికారు.




23.29 శాతం ఫిట్మెంట్ ప్రకటించటం, ఏడు డీఏలను ఈనెల నుండే జీతాలతో కలిపి ఇచ్చేస్తామని చెప్పటం, పెరిగిన జీతాలు కూడా ఈనెల నుండి అమలు చేస్తామని హామీ ఇవ్వటంతో ఉద్యోగసంఘాలు నోరెత్తలేకపోయాయి. అయితే అన్నింటికన్నా మించి ఉద్యోగసంఘాల నేతలు హ్యాపీ అయిన విషయం ఏమిటంటే  ఉద్యోగ విరమణ వయసును 60 నుండి 62కి పెంచటమే. పీఆర్సీని  2018, జూలై నుండి అమల్లోకి తెస్తామని జగన్ చెప్పారు. కారుణ్య నియామకాలను జూన్ లోగా పూర్తిచేస్తామన్నారు.




ఇలాంటివే మరికొన్ని హామీలను కూడా జగన్ ఓకే చెప్పేస్తారని ఉద్యోగసంఘాలు ఏమాత్రం ఊహించలేదు. దాంతో జగన్ తో భేటీ తర్వాత నేతల అందరి మొహాల్లోను ఫుల్లు సంతోషం కనబడింది. ఫిట్మెంట్, ఉద్యోగుల వయో పరిమితి పెంచటం, స్ధలాలు ఇవ్వటం, డీఏలను జనవరి జీతాలతో కలిపి ఇచ్చేస్తామని చెప్పటంతో తామంతా ఫుల్లుగా హ్యాపీగా ఉన్నట్లు నేతలంతా ప్రకటించారు. ప్రభుత్వ-ఉద్యోగసంఘాల మధ్య వివాదం ఇలా సుఖాంతం అవుతుందని టీడీపీ, ఎల్లోమీడియా ఏమాత్రం ఊహించలేదు.




వివాదం మొదలైనప్పటినుండి ఉద్యోగులను ప్రభుత్వంపైకి ఎల్లోమీడియా రెచ్చగొడుతు ప్రతిరోజు వార్తలు, కథనాలు అచ్చేస్తునే ఉన్నాయి. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేతల తీరుపై మండిపోయారు.  ఒకపుడు ఉద్యోగుల సంఘం నేతగా ఉండి ఇపుడు టీడీపీ ఎంఎల్సీ అయిన అశోక్ బాబు ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు శక్తికొద్దీ ప్రయత్నించారు. సమ్మె చేసి వెంటనే ఉపసంహరించుకోవటాన్ని అచ్చెన్న, అశోక్ తట్టుకోలేకపోయారు.  వీళ్ళ ఉద్దేశ్యంలో చర్చలు విఫలమవుతాయని, ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళతాయని అనుకున్నారు. కానీ అనూహ్యరీతిలో జగన్ తో భేటీలో ఉద్యోగసంఘాలు హ్యాపీ అయితే టీడీపీ, ఎల్లోమీడియా క్లీన్ బౌల్డ్ అయిపోయాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: