ఆఫ్ఘనిస్తాన్లో ప్రశాంతమైన ప్రజాస్వామ్య పాలన సాగుతున్న సమయంలో.. అమెరికా స్వార్థ ప్రయోజనాల కోసం తీసుకున్న ఒక నిర్ణయం ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ లో అల్లకల్లోల పరిస్థితుల ను సృష్టించింది. ఒకప్పుడు తాలిబన్ల అరాచకాలను అణచివేసి ఆఫ్ఘనిస్తాన్కు మేము రక్షణగా ఉంటాము అంటూ చెప్పి ఇక ఎంతో మంది సైన్యాన్ని ఆఫ్ఘనిస్థాన్లోని పెట్టిన అమెరికా ప్రభుత్వం.. ఆఫ్ఘనిస్తాన్ ఎటు పోతే మాకేంటి అనుకుందో ఏమో.. చివరికి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని రాబందుల్లా ఎదురుచూసిన తాలిబన్లు ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్  పై పడిపోయారు.



 ఈ క్రమంలోనే తాము వదిలి వెళితే అరాచకం జరుగుతుంది అని తెలిసినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలతో నోరు మెదప లేకపోయారు అమెరికన్ సైన్యం. చివరికి కొన్ని రోజుల్లోనే  జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజాస్వామ్య పాలనమంట గలిసింది. ఆప్ఘనిస్థాన్ ను తాలిబన్ స్వాధీనం చేసుకుని అరాచక పాలన కు తెరలేపారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ అక్కడి ప్రజలందరికీ బానిస బ్రతుకులు మొదలయ్యాయి. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాలిబన్లు చేస్తున్న అరాచకాలకు ప్రజలు మొత్తం అల్లాడిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజల స్వేచ్ఛను హరిస్తు ఎన్నో కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నారు తాలిబన్లు.



 ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో మహిళల అననం జరుగుతోందని తెలుస్తోంది. అభం శుభం తెలియని మైనర్ బాలికలను వృద్ధులతో పెళ్లి చేయడం లాంటివి కూడా చేస్తున్నారట తాలిబన్లు. ఉగ్రవాదం లో ఆరితేరిన వృద్ధులను  స్వాతంత్ర సమరయోధుడు అని పేరు పెట్టి వారికి 10 ఏళ్ల వయసు లోపు బాలికలను ఇచ్చి పెళ్లి చేయడం లాంటి అరాచకాలకు పాల్పడుతున్నారట. అయితే ఇలా తమ బిడ్డలను వృద్ధులకు ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడకపోతే ఇక ఇంట్లో ఉన్న మగవాళ్ళని దారుణంగా ప్రాణాలు సైతం తీస్తున్నారట తాలిబన్లు. ఇది క్రమక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ మొత్తంలో పెరిగిపోతుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: