కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే చైనా విషయంలో ఇతర దేశాలు వ్యవహరిస్తున్న తీరు అచ్చం ఇలాగే ఉంది. ఇతర దేశాల విషయంలో ఎప్పుడూ కుట్రలు పన్నుతూ దారుణంగా వ్యవహరించే చైనాకు ఇక ఇప్పుడు అన్ని దేశాలు షాక్ ఇస్తున్నాయి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగానే గట్టిదెబ్బ కొడుతున్నాయి అన్ని దేశాలు. కరోనా వైరస్ ప్రపంచానికి పాకి పోవడానికి కారణమైన చైనా అదే వైరస్ విషయంలో ఎప్పుడు ఎన్నో నాటకాలు ఆడుతూ ఉంటుంది. అయితే కేవలం పదుల సంఖ్యలో కేసులు వెలుగులోకి వచ్చినప్పటికీ ఆంక్షలు విధిస్తూ వస్తుంది చైనా.ఈ క్రమంలోనే ఇతర దేశాలకు సంబంధించిన విమానాలపై కూడా నిషేధాజ్ఞలు విధిస్తూ వస్తుండడం గమనార్హం.


 ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఇటీవల అమెరికా కీలక నిర్ణయం తీసుకొని చైనా కు దెబ్బకు దెబ్బ కొట్టింది. అమెరికా కు సంబంధించిన ఎయిర్లైన్ సంస్థలకు సంబంధించిన విమానాల పై నిషేధం విధిస్తున్నట్లు చైనా నిర్ణయం తీసుకుని కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఇప్పుడు దీనికి ప్రతీకారంగా అమెరికా కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా కు సంబంధించిన 6 ఎయిర్ లైన్స్ కు సంబంధించిన యుద్ధవిమానాల పై నిషేధం విధిస్తున్నాము అంటూ అమెరికా ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం అమెరికా తీసుకున్న నిర్ణయంతో అటు చైనా కు ఎంతగానో షాక్ తగిలే అవకాశం ఉంది.



 చైనా తీసుకునే నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ అమెరికా చెప్పుకొచ్చింది. ఒకప్పుడు తమ విమానయాన సంస్థల పై నిషేధం విధించినందుకు గాను ఇప్పుడు తాము కూడా చైనా విమానాలపై నిషేధాన్ని విధిస్తూన్నాము అమెరికా తెలిపింది. రానున్న రోజుల్లో చైనా కు సంబంధించిన మరిన్ని విమానాలపై కూడా ఇలాంటి నిషేధిత ఆంక్షలు అమలులోకి వస్తాయి అంటూ స్పష్టం చేసింది అమెరికా. ఇక అమెరికా తీసుకున్న నిర్ణయం అటు చైనా కు ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న చైనాకు ఇక ఇప్పుడు అన్ని యుద్ధవిమానాలపై అమెరికా నిషేధం విధించడంతో మరింత నష్టం వాటిల్లే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: