ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన దేశం ఏది అంటే అందరూ టక్కున చెప్పే పేరు పాకిస్తాన్. ఎప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లో మారణహోమాలు సృష్టించడానికి పాకిస్థాన్ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పాలి. ఇలా ఎప్పుడూ ఉగ్రవాదులను పెంచి పోషించడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది పాకిస్తాన్. ఇక ప్రపంచ వ్యాప్తంగా మత రాజ్య స్థాపన చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ ముందుకు సాగుతూ ఉంటుంది  దేశ ప్రజల ప్రయోజనాలను సైతం గాలికొదిలేసి పాకిస్తాన్ ఎప్పుడు  దాడులకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం పాకిస్తాన్ లో మాత్రమే కాదు పాకిస్తాన్ సహా మరికొన్ని ఉగ్ర దేశాలలో కూడా ఎంతో మంది తీవ్రవాదులు రెచ్చిపోతూ పొరుగున ఉన్న ఎన్నో దేశాలలో మారణహోమం సృష్టిస్తూ ఉండటం గమనార్హం.



 ఈ క్రమంలోనే ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తున్న ఎన్నో దేశాలు కూడా ఉగ్రవాదులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అని తెలుస్తోంది. ఇక ఇలాంటి దేశాలలో ప్రస్తుతం సౌదీ అరేబియా దుబాయ్ లాంటి దేశాలు కూడా ఉండటం గమనార్హం. ఆయా దేశాలలో ప్రస్తుతం ఇస్లామిక్ చట్టాలు అమల్లో ఉన్నాయి ఉన్న విషయం తెలిసిందే. అయినా ఇప్పటికే ఆయా దేశాలకు ఉగ్రవాదుల దాడులు మాత్రం ఎక్కడా తప్పడంలేదు. తరచూ ఏదో ఒక విధంగా దాడి చేస్తూ మారణహోమాన్ని సృష్టించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అటు ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు సరైన బుద్ధి చెబుతూనే ఉన్నాయి ఆయా దేశాల ప్రభుత్వాలు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం అరబ్ దేశాలు గా కొనసాగుతున్న సౌదీ అరేబియా దుబాయ్ సహా మరికొన్ని దేశాలపై హౌతి తీవ్రవాదులు తీవ్రస్థాయిలో దాడి చేస్తూ ఉండడం గమనార్హం. గత కొన్ని రోజుల నుంచి అరబ్ దేశాలు హౌతి తీవ్రవాదుల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొంటుంది.ఇటీవలి కాలంలో హౌతి తీవ్రవాదులు డ్రోన్లతో దాడి చేయడంతో ఇక దుబాయ్ సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా తిరగబడుతూ దాడి చేస్తున్నాయ్.  దుబాయిలోని అబుదాబిలో ఉన్న ఒక ప్రాంతంలో హౌతి తీవ్రవాదులు మిస్సైల్ ప్రయోగిస్తూ ఉన్నారు. ఇక దీనికి ప్రతీకారంగా ఎఫ్ 16  యుద్ధ విమానాలను ఉపయోగించి బాలిస్టిక్ క్షిపణులను హౌతి తీవ్రవాదులకు టార్గెట్ గా వారికి సంబంధించిన లాంచర్ లను ధ్వంసం చేసేందుకు ఉపయోగించాయి అరబ్ దేశాలు. ఇక ఇలా యూఎఈ హౌతి తీవ్రవాదులు సంధించిన డిఫెన్స్ సిస్టమ్స్ ను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: