
తాము జీతాలు తగ్గించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినిపించుకునే స్థితిలో ఉద్యోగులు లేరు.దీంతో త్వరలోనే వీళ్లంతా సమ్మెకు వెళ్లనున్నారు అన్నది తేలిపోయింది.అయితే హై కోర్టులో కేసు ఉన్నందున సమ్మెకు వెళ్లడంపై ధర్మాసనం అభ్యంతరాలు చెబుతోంది.ఈ నేఫథ్యంలో ఉద్యోగులతో మాట్లాడేందుకు సజ్జల రామకృష్ణా రెడ్డితో సహా పలువురు మంత్రులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్నటి వేళ పీఆర్సీ సాధన కమిటీతో కొంత చర్చలు కూడా నడిచాయి.జీఓలు అయితే వెనక్కు తీసుకోవడం కుదరదు అన్నది సజ్జల వాదనగా ఉంది. అంతేకాదు జీతాలు తగ్గుతాయి అన్న మాటలో వాస్తవం లేదని సజ్జల సైతం పదే పదే విన్నవిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు.తమ డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్నారు. నిరసనల్లో భాగంగా రేపు చలో విజయవాడ (ఫిబ్రవరి3) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని కొవిడ్ కారణంగా వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నా వినేందుకు సిద్ధంగా లేరు ఉద్యోగులు.దీంతో ఉద్యోగులకూ, ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. కొత్త ప్లే స్లిప్ చూశాక తమతో మాటల యుద్ధానికి తలపడాలని సీఎస్ చెబుతున్నా ఉద్యోగులు వినిపించుకునేందుకు సిద్ధంగా లేదు.ఈ విషయమై న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించి పోరాటం చేస్తున్నారు.అయితే కొత్త పీఆర్సీ జీఓలతో జీతాలు తగ్గుతాయి అని అనేందుకు అస్సలు ఆస్కారమే లేదని ప్రభుత్వం పదే పదే వాదిస్తుంది. మరోవైపు విచారణ ఉంటుండగా సమ్మె చేయడం మంచిది కాదన్న వాదనను పదే పదే హై కోర్టు వినిపిస్తూ వస్తుంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.