స‌మాన‌త్వ సూచిక‌గా పేర్కొంటూ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరిట ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చే స‌మ‌యం రానే వ‌చ్చింది.ఈ పండుగ‌కు ప్ర‌ధాని మోదీ వ‌స్తున్నారు. ఆయ‌న రాక‌తో భ‌ద్ర‌తా ఏర్పాట్లు మ‌రింత ప‌టిష్టం అవుతున్నాయి. ఈ మధ్యనే బీజేపీతో ఎడం ఎడంగా ఉంటున్న కేసీఆర్ ఆయ‌న‌కు వెల్కం చెప్ప‌డానికి శంషాబాద్ వెళ్లాలి. వెళ్తారు. ప్ర‌ధానిని ఆహ్వానించి త‌రువాత ఆయ‌న‌తో పాటే ప‌లు అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.దేశానికే గ‌ర్వ‌కార‌ణం అయిన రెండు సంద‌ర్భాల్లో ప్ర‌ధాని భాగం అవుతారు. ఒక‌టి రామానుజాచార్యుల విగ్ర‌హం రెండు ఇక్రిశాట్ స్వ‌ర్ణోత్స‌వం. రెండు వేడుక‌ల్లోనూ ప్ర‌ధానే కీల‌కం కానున్నారు. జియ‌రు స్వామి ఆహ్వానం అందుకున్న ఆయ‌న రామానుజాచార్యుల స‌హస్రాబ్ది ఉత్స‌వాల్లో పాల్గొని ప్ర‌త్యేక ఆకర్ష‌ణ కానున్నారు. ఆయా సంద‌ర్భాల్లో కేసీఆర్ పిల్ల‌లు కేటీఆర్, క‌విత కూడా ప్ర‌ధానికి తార‌సిల్ల‌నున్నారు. వారికి కూడా ప్ర‌ధాని  ఏం చెబుతారు? ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాల్లో త‌మ ప్ర‌క‌ట‌న‌ల‌తో హోరెత్తిస్తున్న క‌విత కు, కేటీఆర్ కు ఏం చెబుతారు?
ఏమో మ‌రి!


రాజ‌కీయాల్లో ఏ రోజు ఎలా ఉంటుందో కూడా తెలియ‌దు. ఓ వైపు బ‌డ్జెట్ కేటాయింపులు బాలేవ‌ని మండి ప‌డుతున్న కేసీఆర్ మ‌రోవైపు త‌న‌దైన శైలిలో ప్ర‌ధాని రాక కోసం ప్రొటొకాల్ నియ‌మ నిబంధ‌న‌లు అన్నీ షురూ చేస్తున్నామ‌ని అంటున్నారు. ముచ్చింత‌ల్ లో జియ‌రు స్వామి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించి, అక్క‌డ జ‌ర‌గుతున్న క్ర‌తువులో పాల్గొనే సంద‌ర్భంగా కేసీఆర్ తో ప్ర‌ధాని క‌లిసే ఉంటారు. ఒకే వేదిక‌పై మాట్లాడుకుంటారు కూడా! అయినా కూడా త‌న బాధ తాను చెబుతాన‌ని కేసీఆర్ అంటున్నారు.


స‌మతా మూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్ర‌హాన్ని సంద‌ర్శించేందుకు అదే విధంగా మ‌హా య‌జ్ఞంలోనూ పాల్గొనేందుకు ప్ర‌ధాని న‌రేంద్రుడు ఈ నెల ఐదున రానున్నారు. అదేవిధంగా ఇక్రిశాట్ స్వ‌ర్ణోత్స‌వాల్లోనూ ఆయ‌న పాల్గొననున్నారు.ఇందుక సంబంధించిన ఏర్పాట్లను సీఎస్ స‌మీక్షించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో అధికారులు ప‌లు ఆదేశాలు అందాయి. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లో పాల్గొనే వారంద‌రికీ ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రి అని చెప్పారు.ఆ రిపోర్టు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌రా ఉండాల‌ని అంటూ ఇంకొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చారు.కాగా నిన్న‌టి దాకా కేంద్రం పై కేసీఆర్ నిప్పులు చెరిగారు. కానీ ఇప్పుడు ప్ర‌ధాని వ‌స్తే ఏ విధంగా
న‌డుచుకుంటారో మ‌రి!

మరింత సమాచారం తెలుసుకోండి:

trs