పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నారు. పార్టీలో తనంటే పడని సీనియర్లను, తనతో తీవ్రంగా విభేదిస్తున్న సీనియర్లలో ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో గట్టి లీడర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. స్వయంగా కోమటిరెడ్డి ఇంటికి రేవంత్ వెళ్ళారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం అవ్వటాన్ని కోమటిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే.





పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ తో పాటు కోమటిరెడ్డి కూడా గట్టిగా ప్రయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ నె సెలక్టు చేసింది. అప్పటి నుండి వీళ్ళద్దరికి అస్సలు పడటంలేదు. రేవంత్ పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంతవరకు గాంధీభవన్ కు కూడా రానంటు భీష్మ ప్రతిజ్ఞచేశారు. అప్పటినుండి చాలా విషయాల్లో రేవంత్ ను కోమటిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తునే ఉన్నారు.





అలాంటిది హఠాత్తుగా కోమటిరెడ్డి ఇంటికి రేవంత్ వెళ్ళటం ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా పట్టున్న నేతలనే చెప్పాలి. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా, తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎంఎల్ఏగా ఉన్నారు. వీళ్ళద్దరు పార్టీ బలోపేతానికి చిత్తశుద్దితో పనిచేస్తే పార్టీకి జిల్లాలో మంచి రిజల్టు వస్తుందని అందరు అనుకుంటున్నారు. కారణం ఏదైనా రేవంత్ స్వయంగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్ళి చాలాసేపు మాట్లాడారు.





రేవంత్ కి కోమటిరెడ్డి బ్రదర్స్ కు మధ్య సర్దుబాటు అయితే ఇంకా కొందరు సీనియర్లను దారిలోకి తెచ్చుకోవటం అదేమంతా కష్టంకాదు. వర్కింగ్ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి లాంటి వాళ్ళని అధిష్టానమే సర్దుబాటు చేస్తుంది. సీనియర్లంతా రేవంత్ నేతృత్వంలో ఒకతాటిపైకి వస్తే కాంగ్రెస్ కు మంచి ఊపు రావటం ఖాయమనే అనుకుంటున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ మరోవైపు బీజేపీ చివరకు కాంగ్రెస్ ఎక్కడికక్కడ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. కేసీయార్ మీద వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం నేపధ్యంలో కాంగ్రెస్ లో డెవలప్మెంట్లు నిజంగా ఇంట్రస్టింగనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: