తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డిని నియమించిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్యన సఖ్యత చెడిపోయింది. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ అధిష్టానంపై మింగలేక కక్కలేక వేరే విధాలుగా తమ అసంతృప్తిని తెలియచేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపంతో పార్టీ మీటింగ్ లకు కానీ లేదా ఇతర వ్యవహారాలకు కానీ రాకుండా మొఖం చాటేస్తున్నారు. మొన్నటి వరకు కోమటి రెడ్డి వెంకట రెడ్డి సైతం రేవంత్ రెడ్డి తో కనీసం మాట్లాడకుండా పార్టీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పొలిటికల్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చాలా సార్లు పార్టీపై తన లను ప్రదర్శించారు. కానీ అధిష్టానం ఏమీ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే విషయమై రేపు సంగారెడ్డి నియోజకవర్గం కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి చర్చించి పార్టీని వీడే విషయం గురించి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో భవిష్యత్తు కార్యచరణ గురించి ప్రకటించనున్నారు. ఇవాళ నేతలతో మాట్లాడిన జగ్గా రెడ్డి చాలా బాధపడ్డారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకత్వం నా గురించి రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఒక సీనియర్ నాయకుడి గురించి ఒక కోవర్ట్ అంటూ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బాధపడ్డారు.

పార్టీలో నేను ఉండడం ఎవరికైనా ఇబ్బంది అయితే చెప్పండి వెంటనే వెళ్ళిపోతాను అంటూ కృంగిపోయారు. అయితే ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి కి మధ్యన విబేధాలు ఉన్నాయని క్లియర్ గా తెలుస్తోంది. అంతే కాకుండా ఇంతకు ముందు కేసీఆర్ ను ఒక బహిరంగ సభలో ప్రశంచించడం లాంటి కొన్ని చూస్తుంటే జగ్గారెడ్డి తెరాస లోకి వెళుతారు అని అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: