జగన్మోహన్ రెడ్డి విషయంలో ఢిల్లీ పెద్దలు కొత్త ప్లాన్ ఏమైనా వేశారా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. రీసెంటుగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన తర్వాత ఈ అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి. జగన్ మొదటినుండి కేంద్రప్రభుత్వానికి మద్దతుగానే ఉంటున్నారు. మధ్య మధ్యలో కొన్నిసార్లు వ్యతిరేకంగా వ్యవహరించినా హోలు మొత్తం మీదైతే అనుకూలమనే చెప్పాలి. జగన్ ఎంత అనుకూలంగా ఉన్నా ఏపీ ప్రయోజనాల విషయంలో మాత్రం కేంద్రం కరుణించటంలేదు.





అయితే 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ విషయంలో కేంద్రం దృక్పధం మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఈమధ్యనే గడ్కరీ వచ్చినపుడు ఏపి అభివృద్ధి+జగన్ పై ప్రశంసలు జల్లు కురిపించిన విషయం తెలిసిందే. హఠాత్తుగా గడ్కరీ ఎందుకింతగా పొగిడారంటే అందుకు కేసీయార్ కే థ్యాంక్స్ చెప్పుకోవాలి. నరేంద్రమోడిపై కేసీయార్ రెచ్చిపోతున్నారు. ఏకంగా ఢిల్లీ కోటనే బద్దలు కొట్టేస్తానంటు మంగమ్మ శపథం చేసేశారు. శపథం చేసినంత మాత్రాన ఏదో అయిపోతుందన్నది కాదు.





కేసీయార్ పూర్తిగా వ్యతిరేకమైనపుడు మద్దతిస్తున్న జగన్ను అయినా మంచిగా చూసుకుందామని ఢిల్లీ పెద్దలు అనుకునుండచ్చు. రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గనుక బీజేపీకి వ్యతిరేకమైతే అప్పుడు కేంద్రం దగ్గర జగన్ వెయిట్ పెరిగే అవకాశముంది. అనివార్యతల కారణంగా జగన్ ఇప్పటికిప్పుడు నరేంద్రమోడికి వ్యతిరేకంగా వెళ్ళకపోవచ్చు. కానీ కేంద్రంలో మోడీ బలహీనమైపోయినపుడు కచ్చితంగా జగన్ ప్రత్యామ్నాయం వైపు చూస్తారు. మోడీకి ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు నితిన్ గడ్కరీ వైపు చూస్తున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. రేపే మాపో ఎన్డీయే భాగస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్ బయటకు వెళిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 




ఎందుకంటే రాజకీయాలంటేనే అవసరాలు, అవకాశాలు తప్ప మరేమీకాదు. మోడీతో ఉండడం కన్నా పలానా వాళ్ళతో ఉంటేనే ఎక్కువ ఉపయోగం అని జగన్ కు అనిపిస్తే వెంటనే అటువైపు వెళిపోతారనటంలో ఎలాంటి  సందేహంలేదు. అలా చూడకూడదని మోడీ అనుకుంటే ఇపుడు జగన్ కు ఇచ్చే వెయిట్ మీద ఆధారపడుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: