రాజకీయాల్లో అరుదైన నాయకుడుని ఏపీ ప్రజలు కోల్పోయారు..యువ నేత గౌతమ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం యావత్ తెలుగు ప్రజలని దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ఇక మేకపాటి లేని లోటుని ఏపీ రాజకీయాల్లో ఎవరు తీర్చలేరని చెప్పొచ్చు..అలాగే మేకపాటి లేకపోవడం అధికార వైసీపీకి పెద్ద లోటు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన లేని లోటుని భర్తీ చేయాల్సిన పరిస్తితి వచ్చింది. మంత్రిగా మేకపాటి నిర్వహించిన శాఖల బాధ్యతలని ఇప్పుడు వేరే వాళ్ళకు అప్పగించాలి.

మరి ఏపీ క్యాబినెట్‌లో మేకపాటి శాఖలు నిర్వహించే సత్తా ఉన్న వారు ఎవరంటే చెప్పడం కష్టమే...ఎందుకంటే ఏపీ క్యాబినెట్‌లో మేకపాటి మాదిరిగా ఉన్నత విద్యావంతులు పెద్దగా లేరని చెప్పొచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి, పెట్టుబడులు ఆకర్షించే సత్తా గలిగిన వారు కూడా కనిపించడం లేదు. ఇప్పటివరకు మేకపాటి.. పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, చేనేత జౌళి శాఖలు బాధ్యతలు నిర్వహించారు.

మరి ఇప్పుడు ఈ శాఖలని వేరే వాళ్ళకు అప్పగించాలి...అయితే సీఎం జగన్ త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారని ప్రచారం జరుగుతుంది...మరి అప్పుడు ఈ శాఖలు ఏ నాయకుడుకు అప్పగిస్తారో చెప్పలేని పరిస్తితి ఉంది..ఇక ఈ లోపు ఈ శాఖలని వేరే మంత్రులకు అప్పగించాలి..లేదా సీఎం జగన్ వద్దే ఈ శాఖలని ఉంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఏపీ మంత్రుల్లో కొద్దో గొప్పో ఉన్న విద్యావంతుల్లో ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పుష్పశ్రీ వాణి, సీదిరి అప్పలరాజు, కన్నబాబు లాంటి వారు ఉన్నారు.

బుగ్గన ఎలాగో ఆర్ధిక శాఖ చూసుకుంటున్నారు..మరి ఐటీ, పరిశ్రమలు అనేది ఇంకా భారం పెరుగుతుంది. అటు సురేష్ విద్యా శాఖ చూస్తున్నారు. ఈయనకు నైపుణ్యాభివృద్ధి లాంటి శాఖని ఇవ్వొచ్చు. కానీ ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గౌతమ్ మాదిరిగా ఆ శాఖలని సమర్ధవంతంగా నడిపించే సత్తా ఎవరికి ఉందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: