రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం అనేది పతాకస్థాయికి చేరుకుంది. నిన్న ఒక రోజు హ్యుమానిటేరియన్ కారిడార్ల కోసం రష్యా యుద్ధాన్ని తాత్కాలికంగా విరమింపజేసింది. ఈ రోజు మళ్ళీ ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై విరుచుకుపడుతున్న పరిస్థితి. కీవ్, కర్కివ్ తో పాటు ఇతర ప్రాంతాలపై పెద్దఎత్తున బాంబు దాడులకు కూడా పాల్పడుతున్నారు. అయితే ఈ  ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో జెలన్ స్కీ లొంగిపోయాడనే ప్రచారం జరుగుతోంది. మరొక 72 గంటల లోపు కీవ్ ను స్వాధీనం చేసుకుంటామని రష్యా సైన్యాలు ప్రకటిస్తున్నాయి.

గత రెండు రోజులుగా చూస్తున్నట్లయితే ఉక్రెయిన్ పై ఉదృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. పౌర నివాసాల పైన, పబ్లిక్ ఎస్టాబ్లిష్ మెంట్ పైన, సరఫరా కేంద్రాల పైన దాడులు నిర్వహిస్తుండడంతో ప్రజలు తీవ్రమైన ఆహార కొరకు మరియు విద్యుత్ కొరతతో అల్లాడుతున్నారు. ఇప్పటికే కీవ్ నగరాన్ని రష్యా బలగాలు అన్నివైపుల నుంచి  చుట్టుముట్టాయని సమాచారం అందుతోంది. అయితే చిన్న స్థాయి క్షిపణులు,మధ్య స్థాయి క్షిపణులు ఐరోపా దేశాలు ఇచ్చినటువంటి క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటితో రష్యా కు సంబంధించిన విమానాలను, యుద్ధ ట్యాంకర్లను ఉక్రెయిన్ కు సంబంధించినటువంటి సాయుధ దళాలు, ఉక్రెయిన్  సైన్యాలు వాటిని ధ్వంసం చేస్తున్న ఈ పరిస్థితుల్లో రష్యా వ్యూహాన్ని మార్చి ఉదృతంగా దాడులు నిర్వహించడం కూడా జరుగుతోంది. అత్యాధునిక విమానాలతో పెద్ద ఎత్తున బాబిన్ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఒక ఉక్రెయిన్ లో ఏ నగరాన్ని చూసినా, ఏ ప్రాంతాన్ని చూసినా మొత్తం విధ్వంసమే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నాటో దేశాలు కూడా సాయం చేసే పరిస్థితులు లేవు. పోలాండ్ యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కు అప్పజెప్పుతామన్న ప్రతిపా దనను అమెరికా తిరస్కరించడంతో జెలన్ స్కీ పశ్చిమ దేశాల సహాయం మీద ఆశలు వదులుకోవడం జరిగింది. అయితే యూరోపియన్ యూనియన్ లో చేరే సభ్యత్వం పైన ఆయన ఎటువంటి స్పష్టత అనేది ఇవ్వడం లేదు.

నాటో కూటమి లో చేరబోనని జెలన్ స్కీ స్పష్టం చేశారు.కానీ రష్యా మాత్రం దీనికి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు టర్కీ-రష్యా విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రతిపాదన ముందుకు వస్తుందో చూడాలి. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలను విడిచిపెట్టి, యుద్ధాన్ని విరమించి చర్చల కోసం సానుకూలంగా స్పందిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో పుతిన్ డిమాండ్లకు జెలన్ స్కీ తలొగ్గుతారా..? లేదా అనేది..? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: