మన దేశంలో నగరాలన్నీ కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.అసలు ఏ ఒక్క సిటీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొన్న హెల్తీ ఎయిర్ క్వాలిటీ స్థాయి తగ్గట్టుగా లేదని చెప్పడం నిజంగా మనకు సిగ్గు చేటు. ఇక స్విస్ సంస్థ IQAir ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేసి వెల్లడించిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 లో ఇండియా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించిన లెక్కల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూటెంట్ PM2.5 గాలిలో సగటున 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కు మించి ఉండడడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. కానీ ఇది మన దేశంలో 58.1గా (WHO సూచించిన దానికంటే పదింతలు ఎక్కువ) ఉందని ఐక్యూఎయిర్ సర్వేలో స్పష్టంగా తేలింది. ప్రపంచంలోనే 100 అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 63 సిటీలు మన ఇండియావే ఉన్నాయని తెలిపింది.అంటే ప్రపంచంలో సగానికి పైగా మనవే వున్నాయి. ఇక అలాగే వరుసగా రెండో సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యంత పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీనే నిలిచిందని స్విస్ సంస్థ పేర్కొంది.


ఇక మన దేశంలో ఉత్తరాది సిటీల్లోనే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచం మొత్తంలో అత్యంత తీవ్రమైన కాలుష్యం ఉన్న సిటీల్లో టాప్ సిటీగా రాజస్థాన్ కు చెందిన భీవండి టాప్ లో నిలించింది. రెండో స్థానంలో యూపీలోని ఘజియాబాద్ ఉండగా ఇక మూడో స్థానంలో చైనాకు చెందిన జింగ్ జియాంగ్ సిటీ ఇంకా నాలుగో స్థానంలో మన దేశ రాజధాని ఢిల్లీ తరువాత ఐదో స్థానంలో యూపీలోని జౌన్పూర్ ఉన్నాయి. ఇక టాప్ 15 పొల్యూటెడ్ నగరాల్లో పది మన సిటీలే ఉండడం గమనార్హం. అలాగే మరోవైపు దేశంలో చెన్నై తప్ప అన్ని మెట్రో సిటీల్లో ముందటేడాదితో పోలిస్తే కాలుష్యం చాలా పెరిగిందని ఐక్యూఎయిర్ సంస్థ తెలిపింది.ఇక ఈ గాలి కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల నుంచి వచ్చే పొగేనని ఐక్యూఎయిర్ సంస్థ తెలిపింది. వాహన కాలుష్యం తర్వాత బొగ్గుతో నడిచే థర్మల్ పవర్ ప్లాంట్లు ఇంకా పరిశ్రమలు, కట్టెల పొయ్యిలు ఇంకా అలాగే నిర్మాణ రంగం తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: