మార్చి నెల వచ్చింది అంటే ప్రజలకు గుండెల్లో భయం పట్టుకుంటుంది.. ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇళ్ళ లోంచి బయటకు రావాలంటే జనాలు వణికి పోతున్నారు.అలాంటిది కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడక్కడ వర్షపు చినుకులతో నేల అంతా చల్లగా మారుతుంది..కొన్ని  ప్రాంతాల్లొ పిడుగులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతొ రాష్ట్రం మొత్తం చల్లగా అయ్యింది. గత కొన్ని రోజులుగా అక్కడక్కడా వర్షంతో తడిసిపోతుంది..ఇది ఒక రకంగా మంచి వార్త అనే చెప్పాలి.


ఏపీ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఎన్టీఆర్, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట, నందిగామ, పెనుగ్రంచిప్రోలు, వీరుల్లపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు..అలాగే పలు చొట్ల పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా నెల్లూరు జిల్లాల్లొని నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, మర్రిపాడు.. వైఎస్సార్ జిల్లాలోని గోపవరం మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఆ ప్రాంతంలోని పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించింది.


ప్రభుత్వం సూచించిన వసతి గృహలలో ప్రజలు సురక్షితంగా వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని.. అది క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామంలో పిడుగుల ధాటికి 2 తాడి చెట్లు కాలిపొయాయి..అందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉంటూ తమని తాము రక్షించుకొవాలని హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap