దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలకు పైగా గడుస్తోంది. కేవలం కొన్ని రాష్ట్రాలలో మినహా మిగిలిన చాలా రాష్ట్రాల ప్రజలలో బీజేపీ పాలనపై సంతృప్తిగా లేరు అనే తెలుస్తోంది. అయినప్పటికీ సరిగ్గా ఎన్నికల సమయానికి ఏదోలా చేసి బీజేపీ తమ పంతాన్ని నెగ్గించుకుని ఆయా రాష్ట్రాలలో విజయ దుందుభి మోగిస్తోంది. అయితే ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఈ సంవత్సరాంతంలో జరగనున్న ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. ఆ రాష్ట్రము కూడా బీజేపీ కి కంచుకోట అని తెలిసిందే. మరి ఆ రాష్ట్రము ఏదో ? ఎన్నికల గురించి జరుగుతున్న చర్చ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

గుజరాత్ లో ప్రస్తుతం బీజేపీ అధికర్మలో ఉండగా, ప్రతి పక్ష పార్టీగా కాంగ్రెస్ కొనసాగుతోంది. అయితే ఈ రాష్ట్రంలో ఏడాది చివర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం ఇప్పటి నుండే అన్ని పార్టీలు తమ ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ని ఖచ్చితంగా ఓడిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వాసాన్ని కనబరుస్తోంది. ఇటీవల ఢిల్లీ సీఎం మరియు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో భాగంగా కొన్ని విషయాలను ప్రస్తావించాడు. ఈయన మాట్లాడుతో గుజరాత్ ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారు అని, తమ కష్టాలు మాతో చెప్పుకుని విలపిస్తున్నారని కేజ్రీవాల్ చెప్పారు.

ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ జెండాను ఎగురవేస్తామని ఘంటాపధంగా చెప్పారు. అయితే కేజ్రీవాల్ చెప్పిన విధంగా జరుగుతుందా అన్నది కొందరు రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీని ఓడించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు.. లాగానే అసాధ్యం కూడా కాదు... ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఇందుకు తర్ఖనమే పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం అంటూ ఉన్న అవకాశాన్ని చెప్పారు. మరి ఏమి జరుగుతుంది అనేది  తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి: