వచ్చే ఎన్నికకు సంబంధించి జనసేనకు ఊహించని షాక్ తగిలింది. షాక్ ఏ విషయంలో అంటే పార్టీ ఎన్నికల చిహ్నం విషయంలో. ఏ పార్టీ అయినా జనాల్లో పాపులర్ కావాలంటే దాని ఎన్నికల చిహ్నం కూడా బాగా ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ కు హస్తం గుర్తు, బీజేపీకి కలువపువ్వు, టీడీపీకి సైకిల్, వైసీపీకి ఫ్యాన్, ఆప్ పార్టీకి చీపురు, టీఆర్ఎస్ కు కారు గుర్తు కొన్ని ఉదాహరణలు. పార్టీలకు, ఎన్నికల చిహ్నాలకు మధ్య విడదీయరాని బంధం ఉంటుంది.





అందుకనే ఎన్నికల్లో పార్టీల గుర్తులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు జనాలు పార్టీల గురించి మాట్లాడుకునేటపుడు ఎన్నికల గుర్తులతోనే అంటే హస్తంపార్టీ, సైకిల్ పార్టీ, ఫ్యాన్ పార్టీ, కారుపార్టీ అని మాట్లాడుకోవటం అందరికీ తెలిసిందే.  అయితే ఇదే గుర్తుఇపుడు జనసేనకు పెద్ద సమస్యగా మారిపోయింది. పార్టీ పెట్టినపుడు అధినేత పవన్ కల్యాణ్ తమ ఎన్నికల చిహ్నంగా గాజుగ్లాసును ఎంపికచేసుకున్నారు.





అయితే రెగ్యులర్ గా ఎన్నికల్లో పోటీచేయకపోవటం, గాజుగ్లాసు గుర్తు తమపార్టీకే శాస్వతంగా సొంతమయ్యేట్లు చూసుకోలేకపోయారు. ఎన్నికల గుర్తు తమ పార్టీకే సొంతమవ్వాలంటే కేంద్ర ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో  నిర్ణీత సీట్లు, ఓట్లు తెచ్చుకోవాల్సుంటుంది. అందులో జనసేన ఫెయిలైంది. 2014 ఎన్నికల్లో పోటీచేయకపోవటం, 2019 ఎన్నికల్లో సీట్లు, ఓట్లు తెచ్చుకోలేకపోయింది.





అలాగే ఆ తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా ఓట్లు, సీట్లు తెచ్చుకోవటంలో విఫలమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పి మళ్ళీ ఉపసంహరించుకున్నారు. ఇలా ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవటం, సీరియస్ గా లేకపోవటంతో చివరకు గాజుగ్లాసు గుర్తు రద్దయ్యింది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో ఎవరికో వెళ్ళింది. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ఇంకెవరో పోటీచేశారు. ఇపుడు ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పోటీచేస్తున్నారు. ఈ వరసచూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు గాజుగ్లాసు గుర్తు దక్కేట్లులేదు. అంటే పోటీచేసే అభ్యర్ధులంతా వేర్వేరు గుర్తులపై పోటీచేయాల్సుంటుంది. అదిపార్టీకి పెద్ద దెబ్బనే అనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: