
ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. దేశంలో బీజీపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నంత అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. బీజేపీ నేతలు హైదరాబాద్ లో ఉండి బురద రాజకీయం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుందన్నారు.
సంగారెడ్డిలో బస్తీ దవాఖానల ద్వారా మంచి వైద్యం అందుతుందని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ప్రజల సుస్తీని పోగొట్టి, దోస్తీ దవాఖానగా మారాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఒకప్పటి లాగా లేవన్నారు. అవి పూర్తిగా మారిపోయాయన్నారు. పైసా ఖర్చు లేకుండా వైద్యం, పరీక్షలు, మందులు ప్రజలకు అందుతున్నాయన్నారు. బాలింతలకు కూడా తెలంగాణ సర్కార్ సాయంగా ఉందని అన్నారు. కేంద్రం తో పని లేకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను అందిస్తుందని ఆయన అన్నారు.