వచ్చే ఎన్నికల్లో ఒకేసారి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు డేంజర్ బెల్స్ మొగేట్లే ఉంది. తాజాగా బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాట్లాడిన మాటలు విన్నతర్వాత అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. వీర్రాజు మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీయార్ సేవలను బీజేపీ ఉపయోగించుకుంటుందని చెప్పారు. జూనియర్ ఎన్టీయార్ కు ప్రజాధరణ ఎక్కువని అందుకనే ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందన్నారు.





ఒకవైపు జనసేనతో కలిసే ఎన్నికలకు వెళతామని చెబుతునే మరోవైపు జూనియర్ సేవలను బీజేపీ ఉపయోగించుకుంటుందని చెప్పటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. పవన్ అయినా జూనియర్ అయినా సినీ సెలబ్రిటీలన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి జూనియర్ కు మించే పవన్ కు ఫ్యాన్ బేస్ ఉంది. అయినా ఎన్నికల్లో జూనియర్ సేవలను ఉపయోగించుకుంటామంటే అర్ధమేంటి ? అతిపెద్ద సెలబ్రిటీల్లో ఒకరైన పవన్ను మిత్రపక్షంగా పెట్టుకుని మళ్ళీ జూనియర్ సేవలను ఉపయోగించుకోవాల్సిన అవసరమేలేదు.





అయినా జూనియర్ సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ డిసైడ్ అయ్యిందంటే పవన్ను పక్కన పెట్టటానికి రంగం సిద్ధమైనట్లే  అనుకోవాలి. ఇదే సమయంలో చంద్రబాబునాయుడుతో పొత్తుండని స్పష్టంగా చెప్పేశారు. నిజానికి పొత్తులగురించి మాట్లాడేంత స్ధాయి వీర్రాజుకు లేదు. అయితే పార్టీ అగ్రనేతల అభిప్రాయాలనే వీర్రాజు చెబుతున్నారని అనుకోవాలి. అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ+జనసేన మాత్రమే పోటీచేస్తాయని వీర్రాజు చెప్పిన మాటలకు అర్ధం. బీజేపీకి మాత్రమే జూనియర్ సేవలందిస్తారు. ఇక్కడ సేవలంటే ప్రచారం మాత్రమే అని అనుకోవాలి.






బీజేపీకి జూనియర్ ప్రచారం చేయటమే వాస్తవమైతే టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయకతప్పదు. ఇదే జరిగితే ఇటు జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరికీ ఇబ్బందులు తప్పేట్లులేవు. అంటే ఇద్దరికీ ఒకేసారి డేంజర్ బెల్స్ మొగుతాయనే అనుకోవాలి. ఒకసారి టీడీపీకి వ్యతిరేకంగా జూనియర్ ప్రచారం మొదలుపెడితే ఎన్టీయార్ అభిమానులు, జూనియర్ అభిమానుల రియాక్షన్ ఎలాగుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు పెద్దగా యాక్టివ్ గా లేరని ఒకవైపు చంద్రబాబు మొత్తుకుంటున్నారు. ఇదే సమయంలో జూనియర్ విషయంలో  వీర్రాజు ప్రకటన టీడీపీలో తీవ్ర గందరగోళం రేపుతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: