కొద్ది రోజుల క్రితం, కెనడాలోని అంటారియోలో కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్థి శనివారం మరణించాడు. దీంతో పాటు ఈ ఘటనలో ఓ పోలీసు సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత సోమవారం మిల్టన్‌లో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి గాయపడ్డాడని హిల్టన్ టెరిటోరియల్ పోలీస్ సర్వీస్ (HRPS) ప్రకటన విడుదల చేసింది. అతడిని సత్వీందర్ సింగ్‌గా గుర్తించారు. హామిల్టన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.కెనడా ప్రభుత్వం విద్వేషపూరిత ఘటనలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాల విషయంలో మెతక వైఖరిని అవలంభిస్తోందనే విమర్శలున్నాయి. కొద్ది రోజుల క్రితం ఖలిస్థానీ వేర్పాటువాదులు టోరంటోని స్వామి నారాయణ మందిరాన్ని టార్డెట్‌ చేశారు. ఆలయం గోడవలపై భారత వ్యతిరేక, ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు రాశారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో మంత్రి వర్గంలో ఖలిస్థానీ అనుకూల నాయకుడు జగ్మీత్‌ సింగ్‌కు చోటు దక్కడం భారత్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. కెనడాలో 16 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీరంతా తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కెనడాలో ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలను సీరియస్‌గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కొంత కాలంగా అక్కడ విద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింసపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కెనడాలో నివసిస్తున్న భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.కెనడాలోని భారతీయ పౌరులు, చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాని విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది, భారత్‌ నుంచి కెనడా పర్యటన కోసం వెళ్లినవారిని కూడా అలర్ట్‌ చేసింది.. ఒట్టావాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియాతోపాటు టొరంటో వాంకోవర్‌లలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయాలతో టచ్‌లో ఉండాలని సూచించింది.సంబంధిత వెబ్‌సైట్‌లలో తమ వివరాలు నమోదు చేసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సంప్రదించేందుకు అవకాశం ఉంటుందని ఆ అడ్వైజరీ నోట్‌లో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: