ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి మరియు సీనియర్ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా సొంత ఇంట్లోనే హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో సీఐడీ మరియు సిబిఐ లు విచారణలు చేపట్టినా ఇంకా కేసు క్లోజ్ అవలేదు. దీనిపై చాలా సందేహాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే వివేకా కూతురు సునీత రెడ్డి కూడా తన తండ్రి చావుకు కారణం అయినవారిని ఊరికే వదలకూడదని కోర్ట్ లో ఫైట్ చేస్తోంది. స్వతహాగా డాక్టర్ గా ఉన్న సునీత రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు అంటూ ఎంతో కాలం నుండి వార్తలు వస్తున్నాయి.

కానీ సునీత రెడ్డి నుండి ఎటువంటి ప్రకటన లేకపోవడం గమనార్హం. కాగా ఈమెకు కేసు విషయంలో సరైన న్యాయం జరగడం లేదని, అందుకే రాజకీయాల్లో ఉంటే అయినా తనకు సరియన మద్దతు లభిస్తుందని అనుకుంటున్నట్లు ప్రచారం చేశారు. అయితే సునీత మాత్రం రాజకీయ అరంగేట్రంపై అవును అని కానీ, కాదు అని కానీ చెప్పడం లేదు. కాగా ఒకవేళ ఈమె రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే మాత్రం ఈమెను చేర్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీ టీడీపీ మొదటి స్థానంలో ఉందని చెప్పాలి. వివేకా కేసులో విచారణ వేగవంతం కాకపోవడానికి జగన్ కారణం అని విమర్శలు చేస్తూ సునీతకు మద్దతుగా నిలిచాడు.

అందుకే ఈమెను అడ్డం పెట్టుకుని సొంత జిల్లాలో జగన్ ను దెబ్బ తీయాలని అనుకుంటున్నారు చంద్రబాబు. ఇక జనసేన కూడా ఈమెను చేర్చుకోవడం పట్ల సుముఖంగానే ఉంది. గతంలో సునీత తండ్రి కేసు విషయంలోనూ పవన్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. మరి సునీతకు రాజకీయాలలోకి రావాలన్న ఇంటరెస్ట్ ఉంటే జగన్ కు వ్యతిరేకంగానే ఎన్నికల్లో నిలబడుతుంది అన్నది మాత్రం ఫిక్స్. అయితే పార్టీ టీడీపీ లేదా జనసేన కావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: