అమెరికా: భారతీయులపై దొంగల దండయాత్ర?

న్యూయార్క్ లో పోలీసులు ప్రత్యేకంగా భారతీయ అమెరికన్లను లక్ష్యంగా చేసుకున్న ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. ఇది పండుగల సీజన్ అని.. ఇండియన్లు బ్యాంకులలో కాకుండా ఇళ్లలో బంగారాన్ని తీసుకొచ్చుకుంటున్న వేళ ఈ దొంగల ముఠా దోపిడీకి ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దసరా ఇంకా దీపావళి అనేది భారతీయ స్త్రీలు, పురుషులు సామాజికంగా ఇళ్లలో పార్టీలు చేసుకునే సమయం. గెట్-టుగెదర్లకు హాజరవుతున్నప్పుడు తమ బంగారాన్ని ఒంటిపై లేదా ఇంట్లో పెట్టుకుంటారు. దీంతో ఇదే దోపిడీకి సమయం అని కొందరు దొంగలు స్కెచ్ గీశారని తేలింది.నలుగురు కొలంబియన్ పురుషులు బంగారం దుకాణాలు లేదా ఆభరణాల దుకాణాల్లో షాపింగ్ చేయడానికి లేదా వారి ఇళ్లలో బంగారంతో కనిపించే మహిళలపై నిఘా పెట్టారు. ఇక ఆ తరువాత వారిని వెంబడించి తగిన సమయం చూసి వారి ఇళ్లలోకి చొరబడి నగలు నగదు దోచుకున్నారు. చివరకు న్యూ హైడ్ పార్క్ ప్రాంతంలో దొంగలు పట్టుబడ్డారు.


ఇరుగుపొరుగు వారు నివసించే ప్రదేశానికి సమీపంలోనే ఇది జరిగినందున భారతీయులంతా కూడా చాలా భయపడుతున్నారు.కొలంబియన్లను సరిహద్దు నుండి బహిష్కరించాలని వారంతా కోరుతున్నారు. వారిని దేశంలోకి అనుమతించవద్దని పోలీసులను కోరారు.ఈ నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ అమెరికన్లు కోరుతున్నారు.. తద్వారా ఇతర ముఠాలు నియంత్రించబడుతాయని పేర్కొంటున్నారు. అమెరికాలో బాగా డబ్బు సంపాదించే కమ్యూనిటీ ఏదంటే భారతీయులే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు..వ్యాపారాలు ఇతర రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ కోట్ల డాలర్లు వెనకేసుకుంటున్నారు.తద్వారా అమెరికాలో వివిధ ఖరీదైన ప్రాంతాలలో భారతీయులే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ భారతీయ అమెరికన్లను టార్గెట్ చేసుకొని దోచుకుంటున్నారు. వారి ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి.సంపన్న భారతీయులే లక్ష్యంగా అమెరికాలో ఇలా ముఠాలు ఏర్పడడం చూసి అంతా అవాక్కవుతున్న పరిస్థితి నెలకొంది.కాబట్టి అమెరికా వెళ్లే భారతీయులు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: