అత్యంత సుఖవంతమైన, సులువైన రైలు ప్రయాణంలో ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతాయాని అందరికి తెలుసు..ఆ ప్రమాదాలు జరిగినప్పుడు శాశ్వత వైకల్యం లేదా గాయాల కారణంగా ఆసుపత్రి పాలైనప్పుడు ప్రయాణికుల ఖర్చులను భరించేందుకు భారతీయ రైల్వే ఇటీవల కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది..ప్రమాదాల్లో ప్రయాణికులు మరణిస్తే, వారిపై ఆధారపడిన వారికి, కుటుంబ సభ్యులకు ఆర్థికంగా మరింత బలాన్ని చేకూర్చడంతో పాటు వారు మరింతగా ఇబ్బంది పడకుండా ఉండాలనే లక్ష్యంతో రైల్వే శాఖ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందు కోసం 10 లక్షల వరకు కవరేజ్‌ అందిస్తోంది.


ఈ బీమాను రైల్వే శాఖ ఆపరేషనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆఫ్ రైల్వేస్ కింద ప్రకటించింది. ఈ బీమా సేవలను అందించే కంపెనీల జాబితాను కూడా రైల్వే శాఖ ఖరారు చేసింది..19 బీమా కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. వీటిలో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లను బీమా ప్లాన్ సేవలను అందించడానికి రైల్వే శాఖ ఖరారు చేసింది. ప్రమాణాలను పాటించడంలో విఫలమైన మిగిలిన కంపెనీలను బిడ్డింగ్ ప్రక్రియ నుండి తొలగించారు..

ఈ భీమా ప్రయోజనాలు ఏంటంటే..

రైల్వే శాఖ ఈ బీమా పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయాణికులు టికెట్‌ తీసుకునే సమయం లో 1 రూపాయి చెల్లిస్తే ఈ బీమా సదుపాయం పొందవచ్చు. ప్రయాణంలో మరణిస్తే కుటుంబానికి 10 లక్షలు. శాశ్వత వైకల్యం ఏర్పడితే రూ.10 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. చిన్న వైకల్యం అయితే రూ.7.5 లక్షలు, తీవ్ర గాయాలతో ఆసుపత్రి లో చేరితే రూ.5 లక్షలు వరకు అందుబాటులో ఉంటుంది. మీరు మీ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునేటప్పుడు ఆ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి..నైట్ జర్నీ చేసిన వారికి ఈ భీమా వర్తిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: