పార్టీకి జరుగుతున్న డ్యామేజిని కంట్రోల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డే డైరెక్టుగా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చేసింది. కొన్నినియోజకవర్గాల్లోని నేతల మధ్య విభేదాలు కిందస్ధాయిలో సర్దుబాటు చేసే దశ దాటిపోయింది. పార్టీలోని విభేదాలను మామూలుగా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి డీల్ చేస్తుంటారు. అయితే కొందరిమధ్య విభేదాలు వీళ్ళస్ధాయిలో సర్దుబాటయ్యే దశను దాటిపోయినట్లు పార్టీవర్గాల టాక్.





మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వచ్చేస్తుంటే కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు అంతేస్ధాయిలో పెరిగిపోతున్నాయి. ఎంఎల్ఏలకు ద్వితీయశ్రేణి నేతలకు మధ్య పెరిగిపోతున్న వివాదాలు చివరకు ఎన్నికల్లో విజయంపై ప్రభావం చూపటం ఖాయమని అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ డ్యామేజి కంట్రోల్ కు దిగారట. ఈమధ్యనే నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. ఇదే పద్దతిలో మరికొందరు ఎంఎల్ఏలు, నేతలతో భేటీ అవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట.





పార్టీవర్గాల సమాచారం ప్రకారం నగిరి, మడకశిర, హిందుపురం, వెంకటగిరి, ఉరవకొండ, ప్రొద్దుటూరు, మైలవరం, గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు వ్యతిరేకంగా బలమైన వర్గాలు తయారయ్యాయి. పై నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలను మార్చటమో లేకపోతే ద్వితీయశ్రేణినేతల్లోని అసంతృప్తిని సర్దుబాటు చేయటమే చేయకపోతే చేతులారా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోతుందనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందుకనే డ్యామేజి కంట్రోల్ చేయటానికి స్వయంగా జగనే రంగంలోకి దిగబోతున్నారని సమాచారం.





సోమవారం నుండి సమస్యాత్మక నియోజకవర్గాల వారీగా ఎంఎల్ఏలు, నేతలతో జగన్ భేటీ అవబోతున్నారు. సమస్యలను తెలుసుకుని చెప్పాల్సింది చెప్పి నేతలందరినీ ఏకతాటిపై నడిపించటమే జగన్ ఉద్దేశ్యం. తానుపెట్టుకున్న 175కి 175 టార్గెట్ సీట్లు సాధించాలంటే ప్రత్యర్ధిపార్టీల పైనకన్నా ముందు సొంతపార్టీలోని వివాదాల పరిష్కారంపైన దృష్టి పెట్టాలని జగన్ గుర్తించారు. మరి జగన్ ప్రయత్నాలకు ఎంఎల్ఏలు, నేతలు ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారో చూడాల్సిందే. జగన్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మంచి ఫలితాలే ఉంటుందని అనుకోవచ్చు. లేకపోతే మాత్రం ఎంఎల్ఏలపైనో లేకపోతే నేతలపైనో యాక్షన్ తప్పదని గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: