రాజకీయాలు ఒకప్పటిలా ఇప్పుడు లేవు.. కాలం మారుతున్న కొద్దీ చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు అన్ని రంగాలకు చెందిన వారు రాజకీయాలలోకి రావడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా కళారంగానికి చెందిన వారు రాజకీయాల వైపు ఎక్కువగా రావడం ఇటీవల చూస్తున్నాం. అటువంటి వారిలో ఒకరే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్.. ఈయన ప్రజల శ్రేయస్సు కోసం జనసేన అనే పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో సీఎం అయ్యే దిశగా ప్రజల్లోకి పార్టీని తీసుకువెళుతున్నారు. పవన్ రాజకీయ భావాలూ మరియు అతని ఉద్దేశ్యం నచ్చి ఎందరో తన వెంట కలిసి నడుస్తున్నారు.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం యు ట్యూబర్ హర్ష సాయి కూడా జనసేన లో జాయిన్ అవుతున్నారట. సోషల్ మీడియా తో టచ్ ఉన్న ప్రతి ఒక్కరికే పరిచయం అస్సలు అవసరం లేని వ్యక్తి హర్ష సాయి. హర్ష యు ట్యూబ్ లో వీడియోల ద్వారా వచ్చిన డబ్బును అవసరం లో ఉన్న పేదల చిన్న చిన్న కోరికలు తీర్చడం అన్న మంచి కాన్సెప్ట్ తో చాలా మందికి చేరువ అయ్యాడు. కానీ ఇలా హర్ష చేస్తున్న సహాయంలో కూడా చెడును వెతుకుతున్నారు కొందరు. ఇప్పటికే మంచి పనులు వలన తనకంటూ ఒక ఇమేజ్ ప్రజలలో ఏర్పడింది. ఇప్పుడు జనసేనలోకి కనుక చేరితే అది ఖచ్చితంగా పవన్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎందుకంటే పవన్ కోసం ఒక్క వీడియో చేసి యు ట్యూబ్ లో పెడితే చాలు మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. ఇది పరోక్ష ప్రచారానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ విషయం గురించి వార్తలు ప్రచారం అవుతున్నా ... హర్ష సాయి ఇంకా దీనిపైన స్పందించలేదు. మరి ఇది గాలి వార్తా లేదా నిజమైనదా తెలియాలంటే హర్ష సాయి రెస్పాండ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇది నిజమే అయితే ఎంతవరకు పార్టీకి ప్లస్ అవుతుందో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: