చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతలు ఓ ప్రాంతంపై భయంకరమైన ముద్ర వేసేశారు. అదేమిటంటే రాష్ట్రంలో ఎక్కడ గొడవ జరిగినా అది పులివెందులలోని లుంగీల పనే అన్నట్లుగా. తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం  వైసిపి కార్యకర్తలు, జనాలు కలిసి చంద్రబాబును అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో వెంటనే చంద్రబాబు, అచ్చెన్న, అనూరాధ లాంటి వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ లుంగీల బ్యాచ్ విశాఖపట్నంలో దిగేసిందంటూ ఒకటే గోల మొదలుపెట్టేశారు.

 

ఇక్కడ లుంగీల బ్యాచ్ అంటే వాళ్ళ ఉద్దేశ్యంలో పులివెందుల ఫ్యాక్షనిస్టులని అందులోను జగన్మోహన్ రెడ్డి మనుషులనే అర్ధం వచ్చేట్లుగా నిందల వేశారు. ఇక్కడ పచ్చ బ్యాచ్ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే రాయలసీమలో ఫ్యాక్షనిజం దాదాపు అంతరించిపోయింది. ఫ్యాక్షనిజం మంచి పీక్ లో ఉన్న రోజుల్లో టిడిపిలో కూడా ఫ్యాక్షనిస్టులుండే వాళ్ళన్న విషయం మరచిపోకూడదు. అనంతపురంలో  పరిటాల రవి, కడపలో శివారెడ్డి, పాలకొండరాయుడు, కర్నూలులో భూమా నాగిరెడ్డి లాంటి వాళ్ళ ఫ్యాక్షనిజం గురించి అందరికీ తెలిసిందే.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ మీద ఫ్యాక్షనిస్టు ముద్ర వేయాలని చంద్రబాబు, టిడిపి నేతలతో పాటు పచ్చ మీడియా కూడా బలమైన ముద్ర వేసేసింది. అయితే వాళ్ళు గొంతు చించుకోవటమే కానీ మామూలు జనాలు వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలోని మొత్తం 52 సీట్లకు గాను వైసిపిని  49 సీట్లలో గెలిపించారు. ఇంత జరిగినా చంద్రబాబు అండ్ కో కు బుద్ధి రాలేదు.

 

విశాఖపట్నంను జగన్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసిన ప్రతిపాదనను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా జగన్ ప్రతిపాదనకు వ్యతరేకంగ జనాలు రెచ్చగొడుతున్నారు. ఇందులో భాగంగానే విశాఖపట్నంకు కూడా వచ్చారు. ఇందుకనే వైసిపి కార్యకర్తలతో పాటు మామూలు జనాలు కూడా చంద్రబాబును అడ్డుకున్నారు. దాంతో మళ్ళీ లుంగీ బ్యాచ్ విశాఖపట్నంలో దిగేసిందంటూ నానా యాగీ మొదలుపెట్టారు. అంటే ఎక్కడ ఎవరు గొడవ చేసినా అది పులివెందుల ఫ్యాక్షనిస్టుల పనేనా ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: