తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి, ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి, పార్టీ పరిస్తితి దారుణంగా ఉన్న సమయాల్లో ఇతర పార్టీల వైపు కన్నెత్తి చూడకుండా అదే పార్టీలో తనువు చలించిన నేతలు కోడెల శివప్రసాద్, నరమల్లి శివప్రసాద్.

 

రాజకీయ దిగ్గజం కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే. నరసారావుపేట నుంచి 5 సార్లు, సత్తెనపల్లి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా, నవ్యాంధ్ర స్పీకర్‌గా పనిచేసిన కోడెల…2019 ఎన్నికల్లో ఓడిపోయాక వైసీపీ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేయడం, కుమారుడు, కుమార్తెలు పలు వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో కోడెల ఆత్మహత్య చేసుకుని తనువు చలించారు. అయితే ఆయన చనిపోయిన దగ్గర నుంచి సత్తెనపల్లిలో టీడీపీని నడిపించే నాయకుడే లేడు.

 

బాబు ఇంకా సత్తెనపల్లికి ఇన్‌చార్జ్‌ని నియమించలేదు. కోడెల తనయుడు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తుండగా, మాజీ ఎంపీ రాయపాటి తనయుడు రంగబాబు కూడా సత్తెనపల్లి సీటు దక్కించుకోవడం చూస్తున్నారు. అటు ఎమ్మెల్సీ రామకృష్ణ కూడా సత్తెనపల్లిపై కన్నువేసి ఉంచారు. అయితే ఎంతమంది సత్తెనపల్లి కోసం చూస్తున్నా..బాబు మాత్రం కోడెల శివప్రసాద్ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడుని పట్టుకోలేకపోతున్నారు.

 

ఇక ఇటు చంద్రబాబు బాల్య స్నేహితుడు ఎన్ శివప్రసాద్ గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. 2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీగా గెలిచిన శివప్రసాద్...2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన తనువు చలించారు. ఇక ఆయన చనిపోయాక...చిత్తూరు పార్లమెంట్ బాధ్యతలు బాబు ఎవరికి అప్పగించలేదు.

 

ఇప్పటికీ ఆ పార్లమెంట్ పరిధిలో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. పైగా బాబు సొంత జిల్లా కావడంతో జగన్...ఆ జిల్లాపై గట్టి పట్టు తెచ్చుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాబు గట్టి నాయకుడుని పట్టుకొచ్చి చిత్తూరు పార్లమెంట్ పరిధిలో పెడితేనే వైసీపీకి పోటీ ఇవ్వగలుగుతారు. లేదంటే అంతే సంగతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: