మాజీ మంత్రి దేవిని ఉమా... టీడీపీ సీనియ‌ర్ నేత‌... మాజీ ఎమ్మెల్యే కూడా... రెండో చంద్ర‌బాబు అన్న బిరుదు. ఉమా  సొంత పార్టీలోనే ఎంత మందికి శ‌త్రువు అయినా కూడా బాబు గారికి మాత్రం ఆయన అత్యంత ప్రీతిపాత్రుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా కూడా చంద్రబాబుకి అన్ని విధాలుగా నమ్మిన బంటు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఉమా ఆడింది ఆట పాడింది పాట మాదిరిగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఉమా ఓడినా కూడా చంద్ర‌బాబు, లోకేష్ ఆయ‌న‌కే ప్ర‌యార్టీ ఇస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. 

 

అందుకే వంశీ లాంటి వాళ్లు ఇప్ప‌టికే పార్టీకి దూరం కాగా, బుద్ధా వెంక‌న్న‌, ఎంపీ కేశినేని నాని సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్ర‌బాబు న‌మ్మిన బంటుగా ఉన్న ఉమానే ఇప్పుడు కృష్ణా జిల్లా టీడీపీని బాగా ఇబ్బంది పెడుతున్నారు అనే వ్యాఖ్యలు బాగా వినపడుతున్నాయి.  ఇటీవల పార్టీ సమావేశం ఒకటి జరిగింది. ఈ సమావేశంలో గద్దె రామ్మోహన్ తో పాటుగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత పాల్గొన్నారు. వారు ఏదో చెప్తూ ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చింద‌ట‌. విజయవాడ మేయర్ అభ్యర్ధి వారసత్వ రాజకీయం అనుకుంటున్నారు అంటూ కేశినేని కుమార్తె శ్వేత లక్ష్యంగా ఆయన ఏదో వ్యాఖ్య చేసారు అని టాక్. 

 

ఆ విష‌యం ఆ నోటా ఈ నోటా ఎంపీ నానీకి తెలిసింద‌ట‌. వెంటనే నానీ ఇక ఫైర్ అయిపోయారు. ఇదే విష‌యంపై ఇప్ప‌టికే పార్టీ అధినేత చంద్రబాబుకి ఫిర్యాదు కూడా అందింది. చంద్రబాబు కూడా వెంటనే ఉమాకు క్లాస్ పీకారట. అసలు నేను అలా అనలేదు అని ఉమా అన్నారట. లేదు అన్నారు పక్కన మా పిఏ కూడా ఉన్నారు అని గుంటూరు జిల్లాకు చెందిన నేత కేశినేని కి కూడా చెప్పారట అని బాబు ఉమాకు చెప్పార‌ట‌. దీంతో ఉమా ఏం చెప్పుకోలేక‌పోయార‌ని టాక్‌. ఇది అటు తిరిగి మరి ఎటు తిరుగుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: