తెలంగాణ లో ప్రస్తుతం అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయి.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. భారీ వరదల కారణంగా తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ యొక్క స్థితి గతులు చిన్నా భిన్నం అయ్యాయి. ఇప్పుడిప్పుడే వరద నుంచి కాస్త ఊరటనిస్తుండంతో అధికారులు పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కేటీఆర్ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 


వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ఆయన మృతుల కుటుంబాలకు మాత్రమే ఐదు లక్షల నష్టపరిహారాన్ని అందించారు. ఇటీవల కాలంలో వరద వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఓ విధంగా చెప్పాలంటే కేటీఆర్ తెలంగాణ ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపడానికి ముందుకు వచ్చారని తెలిసిందే.. అందుకు ఉదాహరణ గా వరద బాధితులకు చేసిన సాయాన్ని చెప్పొచ్చు..



ఇది ఇలా ఉండగా తాజాగా మరోసారి మంచి పని చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు.తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు డబల్ బెడ్ రూం ప్లాట్ ను కట్టిస్తామని చెప్పిన సంగతి విధితమే.. ఈ మేరకు గతంలో కొన్ని ఇళ్లను కట్టించిన ప్రభుత్వం ఇప్పుడు మరి కొన్ని చోట్ల పక్కా ఇళ్లను కట్టిస్తుంది. పేద ప్రజలకు 80 లక్షల ఇళ్లు కట్టించాల్సి ఉంది.. అయితే అతి తక్కువ ఇళ్లను మాత్రమే కట్టించింది.ఇప్పుడు మాత్రం మరోసారి ఎన్నికలు వస్తుండటంతో మరో సారి ఈ ఇళ్లను ఓపెన్ చేసే పనిలో తెలంగాణ సర్కార్ ఉన్నారు. ఈ మేరకు జియా గుడాలో కట్టిన రెండు పడకగదుల ఇళ్లను కేటీఆర్ ప్రారంభించారు. ఆ కాలానికి డిగ్నిటీ కాలనీ అని పేరు పెట్టారు. తెలంగాణ సర్కార్ ను మెచ్చుకోడానికి ఒక విషయాన్ని ముఖ్యంగా చెప్పాలి.. పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పారు.. ఇకమీదట అలానే కొన సాగుతాయా లేదా అనేది చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: