పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత ఆర్మీ కంట పడకుండా ఉండేందుకు ఏకంగా సొరంగ మార్గాలను తవ్వుకుంటూ భారత్లోకి ప్రవేశిస్తూ ఉంటారూ.  తద్వారా భారత ఆర్మీ కంటపడకుండా భారత్ లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్ కూడా టన్నెల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా సరిహద్దుల్లో ఈ వ్యూహాన్ని ఆచరణలో పెట్టింది భారత రక్షణ శాఖ.


 ప్రస్తుతం లడక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  రోజు రోజుకు పరిస్థితి తెలుగు మరింత ఉద్రిక్తంగా మారిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు. ఈ క్రమంలోనే లడక్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నచోట టన్నెల్  వ్యూహాన్ని అమలు లో పెట్టింది భారత్ ఆర్మీ. ఈ క్రమంలోనే అక్కడ భూగర్భ సొరంగాలు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది భారత ఆర్మీ. ఇక ఈ సొరంగ రక్షణ వ్యవస్థ భారత ఆర్మీ కి రక్షణ కల్పించడంతో పాటు శత్రు దాడి నుంచి భారత ఆర్మీ ని రక్షించడానికి దానికి మరియు శత్రువుని ఆశ్చర్యచకితులను చేసే విధంగా ఎదురు దాడి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.



 భారత సైన్యం భూమిలో భారీ సొరంగాల తవ్వి  వాటిలో ఆరు నుండి ఎనిమిది అడుగుల వ్యాసం కలిగిన ఇటువంటి హ్యూమ్ రీంపోర్ట్స్  కాంక్రీట్ పైపులు ఏర్పాటు చేసింది. ఇక ఈ టన్నెల్  డిఫెన్స్ యొక్క మరో ఉపయోగం ఏమిటి అంటే వాటిని వేడి చేసి అత్యల్ప ఉష్ణోగ్రతలో  కూడా భారత దళాలకు రక్షణ కల్పించేందుకు అవకాశం ఉంటుంది. గతంలో వివిధ దేశాలు యుద్ధ సమయంలో ఇలాంటి తరహా టన్నెల్  వ్యూహాన్ని అమలు చేశాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు  ఈ టన్నెల్ వ్యూహం  ఉపయోగిస్తే భారత్ చైనా పై ఆకస్మిక దాడి చేసేందుకు టన్నెల్ వ్యూహం  ఉపయోగించింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: