గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో నిలుస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. అయితే ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీని ఎవరు దెబ్బ కొట్టారు ఏంటి అనేది తెలియక పోయినా కొన్ని చోట్ల మాత్రం బలమైన అభ్యర్థులు లేకపోవడమే ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పార్టీ పోటీ చేసినా మొత్తం రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర స్థాయి నాయకుల బలం ఉన్న క్షేత్రస్థాయిలో బలం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలను భారతీయ జనతా పార్టీ తమ పార్టీలోకి తీసుకున్నా సరే ఆశించిన స్థాయిలో వాళ్ళు పనిచేయలేదు అనే భావన రాష్ట్రస్థాయి నేతల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మంది నేతలు వచ్చినా కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు పని చేయలేదు అని చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆశించిన స్థాయిలో పని చేయలేక పోవడంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన విధంగా పని చేయలేక పోయింది అనే భావన వ్యక్తమవుతోంది.

ఇక ఈ ఎన్నికల్లో 30 స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ స్థానాలు వస్తే భారతీయ జనతా పార్టీ కాస్త మెరుగుపడినట్లు కనపడవచ్చు. వాస్తవానికి 2016 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఆరు స్థానాలను ఆ పార్టీ గెలిచింది. మరి ఈ స్థానాలు గెలిచిన తర్వాత ఆ పార్టీకి ఎలాంటి పరిస్థితులు హైదరాబాదులో అనుకూలంగా ఉంటాయి అనేది చూడాలి. కీలక మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: