దెయ్యం అంటే ఎవరికీ మాత్రం భయం ఉండదు చెప్పండి. దెయ్యం పేరు చెబితే చాలు ఒంట్లో అందరికి గుబులు పుడుతుంది. అయితే ఆ దెయ్యం భయంతో ఏకంగా ఒక కాలనీ మొత్తం కాళీ చేసి మరి వెవెళ్లిపోపోయారు. బతికి ఉంటే చాలు అని ప్రాణ భయంతో బేడ, బుడగ జంగాల ప్రజలు అక్కడ నుండి  పారిపోయారు.అసలు వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో సుమారు 40 కుటుంబాలు అక్కడ నివాసం ఉండేవి. అయితే ఇప్పుడు ఆ కుటుంబాలు అన్ని దెయ్యం భయంతో ఆ కాలనీని విడిచిపెట్టి పోవడంతో ఆ  కాలనీ కాస్త  పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది.


అక్కడ గత పదేళ్లుగా  నిరుపయోగంగా ఉన్న ఓ పాత బిల్డింగ్‌లో రాత్రుళ్లు ఒక ఆడ  దెయ్యం సంచారం చేస్తూ  తిరుగుతోందంటూ ప్రచారం మొదలైంది. అంతేకాకుండా ఆ మహిళ బట్టలు లేకుండా  నగ్నంగా బోనం ఎత్తుకుని మరి  డ్యాన్స్ చేస్తోందని కాలనీ వాసులు చెబుతున్నారు . అలాగే  బేడ బుడగ జంగాల కాలనీలో   చింతల భాను, చింతల బాలరాజు అనే అన్నదమ్ములు ఇద్దరు గతేడాది అక్టోబర్‌లో కేవలం వారం గ్యాప్‌లోనే మరణించారు.మళ్ళీ  అదే కాలనీకి చెందిన గంధం రాజు అనే వ్యక్తి కూడ  తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.అయితే వీరి మరణాలకు  చేతబడి, దెయ్యమే కారణమై ఉంటుందని ఆ  కాలనీ వాసులు బలంగా నమ్మడంతో ఒక్కొక్కరుగా బయపడి పోయి అక్కడ నుండి వేరే ఊరికి  వలస బాటపట్టారు.


అలా మంగళవారం నాటికి కాలనీ మొత్తం పూర్తిగా  ఖాళీ అయింది.ఆ  కాలనీకి చెందిన గంధం శేఖర్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఆ కాలనీలో ఉండే  యువకులు మాత్రమే చనిపోతున్నారని, ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక  ఆస్పత్రికి తీసుకుని వెళితే అక్కడ పరీక్షలు చేసి  రిపోర్టుల్లో ఏమీ లేదనే వస్తుందని చెబుతున్నారు. మరి అనారోగ్యం ఎందుకు వస్తుందో అనే కారణం అయితే తెలియడం లేదని అక్కడి కాలనీ వాసులు చెబుతున్నారు. అందుకనే ఇంకా అక్కడ ఉండటం సేఫ్ కాదని భావించి మండల కేంద్రానికి వెళ్లి బతుకుతున్నామని వాపోతున్నారు.అసలు అక్కడ నిజంగా దెయ్యం ఉందా లేదా అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: