తెలంగాణలో జనసేన పార్టీ చేయబోయే రాజకీయాల గురించి అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు జనసేన పార్టీకి అవకాశాలు తక్కువగానే ఉన్నా సరే పవన్ కళ్యాణ్ పార్టీని అన్ని విధాలుగా తెలంగాణలో ముందుకు నడిపించడానికి రాజకీయంగా సిద్ధమవుతున్నారు. అయితే కొన్ని కొన్ని పరిస్థితుల విషయంలో జనసేన పార్టీ అధినేత కొన్ని జిల్లాల్లో జనసేన పార్టీ బలోపేతంపై అవకాశాలు ఉన్నా సరే ఇప్పుడు కొన్ని అంశాలపై దృష్టి పెట్టడం లేదు అనే అభిప్రాయం చాలా వరకు కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే విషయంలో ముందు నుంచి కూడా జనసేన పార్టీ విఫలం అవుతూనే ఉంది.

జనసేన 2014లో స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఇప్పటివరకు దృష్టి సారించలేదు. తెలంగాణలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు ఏంటి అని దానిపై కూడా స్పష్టత రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు ఏంటి అనేది కూడా స్పష్టత లేదు. దీంతో ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులలో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళతారా లేదా అనే విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టత  కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినా సరే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ముందడుగు వేయడం లేదు.

దీని వలన జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులలో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించాయి. షర్మిల కూడా తెలంగాణలో పార్టీ తీసుకురావడానికి రంగం సిద్ధం చేసుకోవడంతో ఏం జరగబోతుంది ఏంటనే దానిపై అందరిలో  కూడా ఒక రకమైన ఆందోళన మొదలైంది. మరి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు నడిపిస్తారు ఎంతవరకు నాయకత్వాన్ని బలోపేతం చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: