ఆఫ్ఘన్ లో తాలిబన్ ల పాలనలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రజలు అటు ఐఎస్ పేలుళ్లకు భయబ్రాంతులకు లోనవుతున్నారు.  మరోపక్క ఆకలి చావులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ విషయాన్ని అక్కడ మాజీ ప్రజాప్రతినిధి మహమ్మద్ మహాకిక్ సామజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. పిల్లలు ఆకలితో చనిపోతున్నట్టు, తాజాగా ఒక్కరోజులో 8 మంది చనిపోయినట్టు ఆయన తెలిపారు. అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘన్ ప్రజలకు అండగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మరోపక్క ఆఫ్ఘన్ లో ఉన్న మైనారిటీలు అయిన హజారా, షియాలపై ఐఎస్ దాడులకు పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇక్కడ తాలిబన్ లు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ప్రజలను పట్టించుకోవడం పక్కన పెట్టి తాము గెలిచిన విషయాన్ని ఆస్వాదించడమే సరిపోతుంది. రోజూ తమకు అడ్డుపడిన వారిని హతమార్చడం లాంటి వారి సంతోషాలను చూసుకుంటున్నారు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వీలైతే ప్రజలను కూడా బాధించడానికే సిద్ధమవుతున్నారు తప్ప దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఇక పరిపాలన మీద దృష్టి పెడదాం అనే ఇంగితం లేకుండా, యధావిధిగా రాక్షసులుగానే ప్రవర్తిస్తున్నారు. మొదటిలో మారాము అని చెప్పినవి అన్ని అబద్ధాలని ఈ చర్యలను బట్టి ప్రపంచానికి స్పష్టం అవుతున్నప్పటికీ అక్కడ హింసకు గురవుతున్న వారిని మాత్రం కాపాడలేకపోతుంది.

రేపటి పసి ప్రాణాలు కూడా ఆకలితో చనిపోవడం ప్రపంచం చూస్తూ ఊరుకోవడం సరికాకపోయినా ఇప్పటికే అక్కడ కు ఆయా స్వచ్చంద సంస్థల పేరుతో వెళ్లి ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అవి ఎంతవరకు సజావుగా సాగుతున్నాయనేది మాత్రం ఎవరికి తెలిసిరావడంలేదు. అవి సరిగ్గా జరిగితే ఆఫ్ఘన్ లో కనీసం పిల్లల ప్రాణాలు నిలబడి ఉండేవి, కాబట్టి స్వచ్చంద సంస్థలను కూడా వారిపని వారిని చేసుకోనివ్వకుండా తాలిబన్ లు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని అర్ధం అవుతుంది. ఇటీవలే ఐఎస్ కూడా అక్కడ ఉన్న షియాలను వదిలేది లేదని హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి కూడా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు అని అంచనా వేసింది కానీ అక్కడ వరకు వెళ్లి సాయం చేయలేకపోతోంది. కనీసం పిల్లలను ఆ నరకం నుండి తెచ్చేసే ప్రయత్నాలు చేస్తే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: